న్యూస్ రీడర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే.. యూట్యూబ్ స్టార్ అయిన జ్యోత్స్న

-

ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మెయింటేన్ చేయడం అనేది పెద్ద విషయం కాదు.. అందులో ఎంత మంది సబ్ స్రైబర్స్ ఉన్నారు, వీడియోస్ కు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఇదే మ్యాటర్. యంగ్ స్టర్ యూట్యూబ్ వీడియోస్ అంటే.. బ్యూటీ టిప్స్, కొత్తిమీర, మెంతులు, ఫేస్ మాస్క్ లు అనే అనుకుంటారు. ఇలాంటివి ఎవరైనా చేస్తారు.. ఈ కాటగిరిలోంచి పైకి రావడం కాస్త కష్టమే.. అత్తాకోడళ్ల గిల్లికజ్జాలు, సామాజిక అంశాలపై సందేశాలు..మన కన్నేపడిన ఇంట్రస్టింగ్ అప్ డేట్స్..ఇలాంటి వాటిపై వీడియోస్ చేస్తూ..ఇప్పుడు లక్షల మందిని ఆకట్టుకుంటోంది మన హైదరాబాద్ అమ్మాయి..జ్యోత్స్న..

తెలంగాణ యాస.. అసలు మాట్లాడుతుంటే తనివితీరా వినాలనిపిస్తుంది. ఎంత బాగుంటుందో కదా.. గలగలా తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడే దోస్తులు పక్కన ఉంటే.. చాలు…బోరే కొట్టదు. అలాంటి మన తెలంగాణ యాసలో యూట్యూబ్ వీడియోలు చేస్తుంది జ్యోత్స్న. ఈమె మొదట న్యూస్ రీడర్ అవ్వాలనుకుందట. జర్నలిజం అండ్‌ మాస్‌కమ్యూనికేషన్ చేసింది. న్యూస్‌రీడర్‌ కావడానికి ఫేమ్‌ కావాలనుకొని టిక్‌టాక్‌లో వీడియోలు చేసేదట… మొదట్లో లిప్‌ సింక్‌లే చేసేదట. అమ్మ ఇచ్చిన సలహాతో.. మోటివేషనల్‌ వీడియోలు చేయడం స్టాట్ చేసింది. ఫాలోవర్లు పెరిగారు.. ఇన్‌స్టాగ్రామ్‌, 2020లో ‘జ్యోత్స్న 28’ పేరుతో యూట్యూబ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

3 రకాల వీడియోలు చేస్తుంది… అమ్మతో కలిసి అత్తా కోడళ్ల మీద సిరీస్‌. దీనికి బాగా పేరొచ్చింది. వివిధ అంశాలపై తన అభిప్రాయాలు, తాజా ట్రెండ్‌లపై కొన్ని. రోజువారీ జీవితంలో తనకు అనుభవమైనవే అంశాలుగా తీసుకుంటుంది.. ప్రతిదానికీ హాస్యం చేర్చినా, అంతర్లీనంగా సందేశం ఉంటుంది. దేన్నైనా భిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తుంది ఈ అమ్మాయి. కాన్సెప్టు నుంచి ఎడిటింగ్‌ వరకూ అన్నీ తనే చూసుకుంటుంది.

మోటివేషనల్‌ అంశాల విషయంలో అమ్మ సాయం తీసుకుంటుందట.. మొదట్నుంచీ బంధువుల్లో చాలామంది వ్యతిరేకించారట.. ఏదైనా చేస్తే ముందు నో చెప్పడం రిలీటివ్ స్ కు బాగా అలవాటు కదా.. ఇంట్లో వాళ్ల సపోర్ట్ ఉంటే ఎంతమంది వద్దన్నా లెక్కచేయక్కలేదు. ఇలా వీడియోల్లో కనిపిస్తే పెళ్లవదని చెప్పేవారట. వరేమన్నా అమ్మానాన్నా తోడు నిలవడంతో.. ముందుకెళ్లింది. చేసేది తప్పు కానప్పుడు ఎందుకు భయపడాలి? అంటోంది జ్యోత్స్న.

ఇక పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ అంటే.. పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. ఈ యంగ్ యూట్యూబర్ కు కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చేవట. చెడును వదిలేసి.. మంచిని మాత్రమే తీసుకోని.. కమెంట్స్ లో ఎవరైనా.. మంచి సలహాలు ఇస్తే వాటినే ఫాలో అయ్యేదట. ఫేమ్ రావడంతో.. సినిమా, వెబ్‌ సిరీస్‌ ఆఫర్లూ వచ్చాయి. ఆడిషన్‌లో అంతమంది ముందు నటించడం ఇబ్బందనిపించి వద్దని చెప్పిందట. ప్రభాస్‌, అల్లు అర్జున్‌కి చెల్లెలిగా అవకాశమొస్తే మాత్రం చేస్తా అంటోంది జ్యోత్స్న.

.ప్రస్తుతం వీడియోస్ పాటు.. జానపద కవర్‌ సాంగ్‌లనూ చేస్తుంది. కూతురి ఎదుగుదలను చూసి తన తల్లే చాలా సార్లు ఆశ్యర్యానికి గురయ్యేదట. అమ్మాయి అనుకుంటే ఏదైనా చేయగలరు.. కావాల్సిందల్లా.. కాస్త ప్రోత్సాహం అంటుందో జ్యోత్స్న. ఎంతోమంది యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యారు. మంచి కాన్సప్ట్, క్వాలిటీ కంటెంట్ ఇస్తే.. స్టెప్ బై స్టెప్ ముందుకెళ్లొచ్చు. నాలుగు ఐదు వీడియోలు చేసి.. వ్యూస్ రావడం లేదు, ఫాలోవర్లు పెరగడం లేదని నిరుత్సాహపడితే ఎలా..?

Read more RELATED
Recommended to you

Exit mobile version