పవన్ తో అయితే ఓకే…

-

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధ్యక్షులతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మధ్యాహ్నం త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల గురించి మీడియాతో మాట్లాడుతూ… ఈ సారి ఎన్నికల్లో తమ పార్టీ ప్రభంజనం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎవ్వరితో పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలో ఉంటామన్నారు.  ఒకవేళ ఎవరైనా తమతో కలిసి వస్తామంటే ఐదో, పదో సీట్లు ఇస్తామంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పార్టీల్లో అన్నింటికంటే జనసేన అయితే ఓకే అన్నారు. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే నియోజకవర్గానికి రూ.వంద కోట్ల చొప్పున విరాళం ఇస్తానన్నారు. దీనితో పాటు పార్టీలో వెయ్యి మందిని చేర్పించినవారికి రూ.3 వేల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చేశారు.

సేవ్ సెక్యూలర్ ఇండియా, మోడీ ఎన్నికల హామీలను విస్మరించడం, ఏపీలో చంద్రబాబు పాలనా వైఫల్యం…ఈ మూడు కారణాలతో దేశ భవిష్యత్ కోసం తాను ఈ సారి గెలవనున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు భిన్న రకాల కామెంట్లు చేస్తున్నారు..వీటిలో ‘పాల్ గారు పాపం.. మీ అవసరం ఎంతైనా ఉంది..అవును మరి మీ లాంటి వారికోసమే ఇటు రాష్ట్రం, అటు దేశం ఎదురు చూస్తోంది అంటూ…పలు రకాల కామెంట్స్’ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version