పీకే ఒక పొలిటికల్‌ ప్రాస్టిట్యూట్‌ : కేఏ పాల్‌..

-

క్రైస్తవమత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్​మరోసారి మీడియా ముందకు వచ్చి.. కాంగ్రెస్‌ పై విమర్శలు చేశారు. కేఏ పాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వరంగల్ సభ కోసం 87కోట్ల రూపాయిలు ఖర్చు చేసిందని, ఎప్పుడైనా 70సంవత్సారలలో రైతులకు గిట్టబాటు ధర ఇచ్చారా? అని ఆయన మండిపడ్డారు. అంతేకాకంఉడా.. దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రాహుల్ గాంధీ వాగ్ధానాలు అన్ని వింటే నవ్విస్తుందన్నారు కేఏ పాల్‌. ఇది కేవలం తెలంగాణ ప్రజలని మోసం చేయడం కోసమేనన్న కేఏ పాల్‌.. ఎందుకు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఈ పథకాలను అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

రాహుల్‌ గాంధీ మాయ మాటలు విని ప్రజలు మోసపోయేందుకు సిద్ధంగా లేరని కేఏ పాల్‌ అన్నారు. కాంగ్రెస్‌కు దేశంలో ఎక్కడ డిపాజిట్ లు రాలేదని, మీరు దేశాన్ని, ప్రజలను మోసం చేశారు… అందుకే మీకు ఈ శిక్ష అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు అంత ఈ కుటుంబ పాలన వద్దు అని అంటున్నారని, పీకే ఒక పొలిటికల్ ప్రాస్టిట్యూట్ అని కే ఏ పాల్‌ కొత్త పేరు పెట్టారు. ఆయన ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తారో వారి దగ్గరకు వెళ్తారని, నేను 750 కోట్లు ఇస్తాను అని చెప్పానని, కానీ ఆయనకు అంత కంటే కాంగ్రెస్ ఎక్కువ ఇస్తుంది అనుకుంటా? అందుకే పీకే అక్కడికి వెళ్లారు అంటూ కేఏ పాల్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version