అధ్యక్షుడి పాలనలో కన్నా తాలిబన్ల చేతిలో కాబూల్ సురక్షితం.. రష్యా

-

గత కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ దేశంపై తాలిబన్లు జరిపిన దాడులు ఆఖరుకు ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళేలా చేసాయి. అటు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు సహా సైన్యం కూడా ఏమీచేయలేకపోయింది. కాబూల్ ని పూర్తిగా ఆక్రమించుకున్నాక, ఇక ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లదే అని ప్రకటించుకున్నారు. అధ్యక్షుడు ఘని ఎక్కడికో పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. అది కూడా కార్ల నిండా డబ్బులు తీసుకుని అని రావడం గమనార్హం. ఐతే గడిచిన 24గంటల్లో ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయమై, రష్యా రాయబార కార్యాలయం వెల్లడి చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఘని పాలనలో కంటే తాలిబన్ల చేతిలో కాబూల్ సురక్షితంగా ఉందని, అంతకు ముందు కంటే ఇప్పుడు పరిస్థితి బాగానే ఉందని తెలిపినట్లు రాయిటర్స్ ప్రచురించింది. ఆదివారం రోజున ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు పారిపోయినట్లు సమాచారం. ఆఫ్ఘన్ లో రక్తపాతం జరగకుండా ఉండేందుకే దేశం వదిలి పారిపోయాడని కొంతమంది వాదన. ఇప్పటికైతే ఘని ఎక్కడ ఉన్నాడనేది ఇంతవరకు తెలియదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version