వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను…చేతులెత్తేసిన కడియం శ్రీహరి !

-

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ కాంగ్రెస్ పార్టీ క‌డియం శ్రీహరి సంచ‌ల‌న కామెంట్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోన‌ని క‌డియం శ్రీహ‌రి ప్ర‌క‌టించారట‌. పోటీకి దూరంగా ఉంటాన‌ని వివ‌రించారట‌. ఈ మేర‌కు స్టేష‌న్ ఘ‌న్‌పూర్ కాంగ్రెస్ పార్టీ క‌డియం శ్రీహరి చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

kadiyam srihari
kadiyam srihari

ఇది ఇలా ఉండ‌గా…కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. ప్రజల అభీష్టం మేరకే కడియం పార్టీ మారి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జెండా పట్టుకుని తెలంగాణ మొత్తం తిరగాలని.. పూలదండలు వేస్తారో లేక చెప్పుల దండ వేస్తారో కడియం సిద్ధంగా ఉండాలని కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. కడియం శ్రీహరి అవినీతి తిమింగలం అని ఆరోప‌ణ‌లు చేశారు తాటికొండ రాజయ్య. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తులు అమ్ముకుంటే.. కడియం మాత్రం ఆస్తుల మీద ఆస్తులు కొంటున్నాడని వెల్ల‌డించారు. కావాలంటే మా ఇద్దరి ఆస్తులను చూడండన్నారు తాటికొండ రాజయ్య.

 

Read more RELATED
Recommended to you

Latest news