దశాబ్దానికి పైగా హీరోయిన్ గా రాణించడం అంటే నిజంగా ఒక సంచలనమే. ఎక్కడో ఒకరిద్దరు హీరోయిన్లు మినహా ఈ విధంగా రాణించడం అనేది సాధ్యం కాని పని. అలాంటిది కాజల్ అగర్వాల్ దాదాపుగా హీరోయిన్ గా రాణిస్తుంది. ఏ కుర్ర హీరోయిన్ కి దక్కని విధంగా అవకాశాలను దక్కించుకుంటూ అందరి సరసనా నటిస్తూ అవకాశాలను కొట్టేస్తుంది. ప్రస్తుతం టాలివుడ్ లో తమిళంలో ఈ భామ హవా మోస్తారుగా నడుస్తుందనే చెప్పవచ్చు. ఎవరితో ఎలా ఉండాలో తెలిసిన ఈ అమ్మడు మరిన్ని సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామ మనసు నిర్మాణ రంగంపై పడింది.
సినిమాలను నిర్మించాలని భావిస్తూ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాజల్ అగర్వాల్. అ సినిమా దర్శకుడైన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాను నిర్మించడానికి భావించిన కాజల్ అనూహ్యంగా ఆ సినిమాను వదిలేసింది…. ప్రశాంత్ వర్మ, కాజల్ కాంబినేషన్లో రూపొందిన `అ!` సినిమాకు సీక్వెల్గా ఈ సినిమాను సినిమా మొదలు కాకముందే ఆపెయ్యాలని నిర్ణయం తీసుకుని మరో సినిమా మీద దృష్టి సారించింది.
అసలు ఎందుకు ఆపేసింది అనేది కారణం తెలియకపోయినా దర్శకుడితో వచ్చిన విభేదాలే దీనికి కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 సినిమా మీద దృష్టి పెట్టింది.