నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. NSEలో గంటను మోగించిన బాలకృష్ణ.. అరుదైన రికార్డు సృష్టించాడు. ముంబై నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో గంటను మోగించిన తొలి దక్షిణాది నటుడిగా రికార్డు సృష్టించాడు నందమూరి బాలకృష్ణ.

NSE అధికారుల ఆహ్వానం మేరకు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బృందంతో కలిసి స్టాక్ ఎక్సేంజ్‌ను సందర్శించారు బాలకృష్ణ. ఈ సందర్భంగా NSEలో గంటను మోగించారు నందమూరి బాలకృష్ణ. NSEలో ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకల సందర్భంగా అతిథులు గంటను మోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తరుణంలోనే…. NSEలో గంటను మోగించారు నందమూరి బాలకృష్ణ.
ఇక ఇటీవలే నరసింహం నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం వరించింది. సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలుగా అభిమానులను అలరించడం 15 సంవత్సరాలుగా బసవతారకం ఆసుపత్రి ద్వారా అతడు చేస్తున్న సేవలను గుర్తిస్తూ యూకే లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ నరసింహ నందమూరి బాలకృష్ణకు గుర్తింపు ఇచ్చింది. దేశ సినీ చరిత్రలో ఈ గుర్తింపు దక్కించుకున్న ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ కావడం ప్రత్యేక విశేషం.