కాజ‌ల్ అగ‌ర్వాల్ హ‌నీమూన్ ఖ‌ర్చెంత‌?

-

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌ను ఇష్ట‌ప‌డిన వ్య‌క్తి గౌత‌మ్ కిచ్లూని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇరు కుటుంబాల అంగీక‌రాంతో అక్టోబ‌ర్ 30న వీరి పెళ్లి హోట‌ల్ తాజ్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వీరి పెళ్లికి అత్యంత స‌న్నిహితులు కొంత మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. క‌రోనా కార‌ణంగా అతి త‌క్కువ మంది ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

కాజ‌ల్ వివాహానంత‌రం హ‌నీమూన్ కోసం భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డి ల‌గ్జ‌రీ హోట‌ల్‌లో విహ‌రిస్తూ ఆ ఫొటోల్ని అభిమానుల‌తో పంచుకుంది. బీచ్‌లో హంగామా చేస్తున్న ఫొటోల్ని కూడా షేర్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. స‌ముద్ర గ‌ర్భంలో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన గ‌దిని హ‌నీమూన్ కోసం ప్ర‌త్యేకంగా తీసుకున్న కాజ‌ల్ జంట ఆ ఫొటోల్ని కూడా అభిమానుల‌తో పంచుకుంది.

దీంతో కాజ‌ల్ హ‌నీమూన్ ఖ‌ర్చు ఎంత అంటా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ మొద‌లైంది. తెలిసిన వాళ్లు ఒక‌లా తెలియ‌ని వాళ్లు మ‌రోలా కాజ‌ల్ హ‌నీమూన్‌కి ఇంత ఖ‌ర్చు చేసిందంటే ఇంత అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. ఒర‌కిజిన‌ల్‌గా కాజ‌ల్ త‌న హ‌నీమూన్‌కు 40 ల‌క్ష‌లు ఖర్చు చేసింద‌ని తాజా టాక్‌. దీంతో నెటిజ‌న్స్ హ‌నీమూన్‌కే ఇంత ఖ‌ర్చు చేసిందా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version