లోకేశ్‌ గళం ఎందుకు వినిపిస్తున్నారో, ఆయన గళాన్ని ఎవరు వింటారో చూడాలి : కాకాణి

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువ గళం’ పాదయాత్రపై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అయితే.. ఈ నెల 27న నారా లోకేశ్‌ యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభంకానుంది. 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సుదీర్ఘంగా కొనసాగనుంది. మరోవైపు లోకేశ్ పాదయాత్రపై గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన గళం ఎందుకు వినిపిస్తున్నారో, ఆయన గళాన్ని ఎవరు వింటారో చూడాలని ఎద్దేవా చేశారు. ఆయన గళం వినాల్సిన స్థితిలో ఏపీ యువత లేదని అన్నారు గోవర్ధన్ రెడ్డి. కేవలం అధికారం కోసమే పాదయాత్రను చేపడుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.

గతంలో ఆయన ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఏం సాధించారో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. లోకేశ్ పాదయాత్రతో టీడీపీకి ఒరిగేది ఏమీ లేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని కాకాణి గోవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇరిగేషన్ పనులపై వాస్తవాలు చెప్పే దమ్ము ధైర్యం కాకాణికి వుందా అని ఆయన ప్రశ్నించారు. కనుపూరు కాలువపై ఇరిగేషన్ అధికారులు సమాచారం ఇవ్వడం లేదని, కాలువల పూడికతీతలో అధికారులతో కలిసి రూ.90 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version