తెలంగాణ రాష్ట్రం చేనేత మరియు టెక్స్టైల్స్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సంక్షేపించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (KMTP) ఈ అభివృద్ధిలో ముఖ్యమైనది. వరంగల్ జిల్లాలో స్థాపించబడిన ఈ పార్క్ చేనేత కళాకారులకు ఆధునిక సదుపాయాలు అందించడం ఉద్యోగాలు సృష్టించడం,పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేస్తుంది. ఈ టెక్స్టైల్ పార్క్ యొక్క లక్ష్యాలు, అభివృద్ధి, చేనేత రంగానికి ప్రయోజనాలు వివరంగా తెలుసుకుందాం..
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టులో ఒకటి. ఇది ప్రధానమంత్రి మిత్ర పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 7 మెగా టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి. 2017లో ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శంకుస్థాపన చేశారు. ఈ పార్క్ కాటన్ టు గార్మెంట్ మోడల్ పై నిర్మాణం చేయబడుతుంది అంటే పత్తి నుంచి దుస్తులు వరకు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. 2023లో కేంద్రం ఆమోదం పొందిన ఈ పార్క్ తెలంగాణను చేనేత హబ్ గా మారుస్తుంది.

ముఖ్య లక్ష్యం: వరంగల్ జిల్లాలో శాయంపేట గ్రామం-చింతలపల్లి గ్రామంలో ఈ పార్క్ స్థాపించబడింది ఇది హైదరాబాద్ వరంగల్ హైవే కి సమీపంలో నిర్మించారు. స్పిన్నింగ్, వీవింగ్, ప్రాసెసింగ్, రెడీమేడ్,వంటి అన్ని దశలకు సదుపాయాలు అందించడం లక్ష్యంగా దీనిని రూపొందించారు. 10,000 కోట్ల రూపాయల పెట్లుబడులు ఆకర్షించడం. 75 వేల ఉద్యోగాలు 25వేలు ఇన్ డైరెక్ట్ ఉద్యోగాలు మొత్తం 2 లక్షల మందికి ఉపాధి కల్పించడం ఈ పార్క్ ముఖ్య లక్ష్యం. చేనేతకారులకు ఆధునిక యంత్రాలు శిక్షణ మార్కెటింగ్ సదుపాయాలు అందించడం చేనేత అభివృద్ధికి తోడ్పడడం ఈ పార్క్ లక్ష్యం.
అభివృద్ధి: పార్క్ నిర్మాణం దశలవారీగా జరుగుతుంది 2022లో ఉత్పత్తి యూనిట్ ప్రారంభమైంది 60 ఎకరాల్లో 364 పవర్లూమ్ యూనిట్లు స్థాపించబడ్డాయి. ఇవి 500 మందికి డైరెక్ట్ ఉద్యోగాలు, 4000 మందికి ఇన్ డైరెక్ట్ ఉద్యోగాలు అందిస్తున్నాయి. 2023లో పీఎం మిత్ర పథకం కింద ఆమోదం పొందిన తర్వాత పార్క్ వేగంగా అభివృద్ధి చెందింది. 2025లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ చేనేత హబ్ గా మారుతుందని ప్రకటించారు. కిటెక్స్ టెక్స్టైల్స్ వంటి కంపెనీలు 1000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాయి.
కేంద్ర ప్రభుత్వం సహాయం: కేంద్రం పీఎం మిత్ర పథకం కింద పార్కును ఆమోదించింది. దీనికోసం కేంద్రం రూ.1500 కోట్లు నిధులను కేటాయించారు.అంతేకాక 100 ఎలక్ట్రానిక్ జార్వేడ్ వీవింగ్ మిషన్ లో పంపిణీ 31 చేనేత ప్రొడ్యూసర్ కంపెనీలు స్థాపన. హిమ్రు ఫ్యాబ్రిక్, పీతంబరి శారీలు, ఆర్మూర్ సిల్క్ సారీలు పునరుద్ధరించడం, సిద్దిపేట కమలాపూర్, దుర్భక్, వరంగల్ లో చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేయడం. 900 మంది చేనేత కళాకారులకు ఆధునిక శిక్షణ ఇవ్వడం. 70 కోట్ల ముద్ర లోన్లను అందించడం. తెలంగాణలో సుమారు 48 వేల చేనేత కళాకారులు 17 రకాల చేనేతలపై పని చేస్తున్నారు అందులో పోచంపల్లి, ఇక్కట్, నారాయణపేట కాటన్ శారీలు ప్రసిద్ధి చెందినవి.