వర్షాకాలం తేమతో కూడిన వాతావరణం వల్ల శరీరం దుర్వాసన వచ్చే సమస్య తలెత్తుతుంది. సాధారణంగా ఈ సమస్య ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ వర్షాకాలంలోనూ అధిక తేమ, చెమట బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతాయి. దుర్వాసన సమస్య మరింత తీవ్రతరం చేస్తాయి. దీనికి పరిష్కారంగా అందరూ మార్కెట్లో దొరికే స్ప్రే బాటిల్స్ ను వాడుతుంటారు కానీ ఇది ఎక్కువ వాడితే ప్రమాదం మరి అలాంటప్పుడు సహజమైన చిట్కాలను తెలుసుకోవడం ముఖ్యం. మరి సహజమైన చిట్కాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
వర్షాకాలంలో తేమ వల్ల చెమట, బ్యాక్టీరియా చర్మం పై సులభంగా పెరిగిపోతాయి. రోజు స్నానం చేయడం ద్వారా శరీరాన్ని శుభ్రంగా ఉంచవచ్చు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి స్నానం చేయడం బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. సహజ యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు లేదా వేప ఆకులను నీటిలో వేసి స్నానం చేయవచ్చు. శరీరంలో చెమట ఎక్కువగా పోసే ప్రదేశాలను బాగా సబ్బుతో రుద్ది స్నానం చేయడం వలన శరీరం దుర్వాసన నుండి నిర్మూలించవచ్చు.

వర్షాకాలంలో చర్మానికి గాలి ఆడని దుస్తులు ధరించడం వల్ల చెమట ఎక్కువగా వస్తుంది. కాటన్,లెనిన్ వంటి సహజమైన గాలి ఆడే బట్టలను ఎంచుకోవాలి. రోజు శుభ్రమైన దుస్తులను మాత్రమే ధరించాలి తడి బట్టలను వెంటనే మార్చాలి. చెప్పులు లేదా మాస్క్ తడిగా ఉంటే వాటిని ఎండపెట్టి శుభ్రమైన జతలను ఉపయోగించాలి.రెండు మూడు చుక్కలు టీ ట్రీ ఆయిల్ ను కొబ్బరి నూనెలో కలిపి శరీరానికి రాయండి లేదా స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు కలపండి.
ఇక మార్కెట్లో దొరికే రసాయన డియోడెంట్స్ బదులుగా సహజ పదార్థాలతో దుర్వాసన నియంత్రించాలి. నిమ్మరసంలో కొద్దిగా నీరు కలిపి శరీరానికి చెమట ఎక్కువగా వచ్చే ప్రాంతంలో రాయండి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ బ్యాక్టీరియాలను తగ్గిస్తుంది. అలాగే కొబ్బరి నూనెలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి చర్మం పై రాయండి ఇది చెమట దుర్వాసనను తగ్గిస్తుంది రోజ్ వాటర్ ను స్ప్రే బాటిల్ లో నింపి చర్మంపై చల్లండి ఇది సహజ సుగంధాన్ని ఇస్తుంది.
ఆహారం కూడా శరీర దుర్వాసన,నోటి దుర్వాసన పై ప్రభావం చూపుతుంది వర్షాకాలంలో కొన్ని ఆహారాలను నివారించడం మంచిది. వెల్లుల్లి, ఉల్లిపాయ, మసాలా ఆహారాలను తగ్గించండి. అంతేకాక పచ్చి కూరగాయలు, పండ్లు పుదీనా వంటి సుగంధ ఆహారాలను ఎక్కువగా తీసుకోండి. తగినంత నీరు తాగండి రోజు రెండు లీటర్ల నీరు శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది.