పురాణాల ప్రకారం కాలభైరవుని రూపం ఇలా వచ్చింది. ఒకసారి బ్రహ్మ యొక్క గర్వం అనచివేయడానికి శివుడు హోంకరించాడు. ఆ హుంకారం నుండి ఒక రూపం వెలువడింది. ఆ రూపమే కాలభైరవ స్వామి. శివుని క్షేత్రాల లో కాలభైరవుడు కొలువై ఉంటాడు మరియు క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. కాలభైరవుడిని శనివారంతో కూడిన త్రయోదశి నాడు పూజించాలి లేక కాలభైరవునికి ప్రీతికరమైన రోజులు శనివారం మరియు మంగళవారం నాడు పూజించవచ్చు.
ప్రదోష కాలం అనగా సాయంత్రం 5:30 నుండి 6:30. కాలభైరవుని పూజల లో నివేదనకు మినప గారెలు నివేదించాలి. పూజలో శ్రీ కాలభైరవ సహస్రనామ స్తోత్రం, నామావళి , అష్టకం, భైరవ కవచం వంటి స్తోత్రాలు వినడం లేదా చదవడం చేయాలి. ఈ విధంగా కూడా భైరవ అనుగ్రహం పొందవచ్చును. శాస్త్రం ప్రకారం గ్రహ బాధలు దూరం కావాలి అనుకున్న వారు, కాల భైరవ హోమం చేయించుకోవాలి. ఈ హోమం చేయడం వల్ల గ్రహబాధలు తొలగి ఆరోగ్యవంతులుగా ఉంటారు.