కల్యాణ్ రామ్ అమిగోస్‌ సంచలన ట్రైలర్ డేట్ ఖరారు.!

-

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా థియేటర్ల లో వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. బింబిసారుని జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంటసీ డ్రామా నేపథ్యంలో డెబ్యూ డైరెక్టర్‌ వశిష్ఠ్‌ ఈ ను తెరకెక్కించాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కె. హరికృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ ను నిర్మించారు. దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్యాణ్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇక బింబి సార బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ తర్వాత, కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన తదుపరి చిత్రం అమిగోస్‌ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న గ్రాండ్‌గా థియేటర్ల లో విడుదల కానుంది. యూనిట్ వర్గాలు  ఫిబ్రవరి 3న థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కు ఏర్పాటు చేస్తున్నారు.ట్రైలర్ విడుదల తేదీని తెలియజేయడానికి కళ్యాణ్ రామ్ సిగార్ తాగుతున్న అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సినిమా టీజర్ ఇప్పటికే సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ ఏకంగా మూడు పాత్రలు పోషిస్తున్నారు. ఇవి కూడా దేనికవే వెరైటీగా గా ఉన్నాయి. ఇక సినిమా విడుదల అయ్యి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి

Read more RELATED
Recommended to you

Exit mobile version