‘బంగార్రాజు’దర్శకుడు కల్యాణ్ కృష్ణ కు బంపర్‌ ఆఫర్‌

-

నూతన సంవత్సరం ఆరంభంలోనే దర్శకుడిగా కళ్యాణ్‌ కృష్ణ మంచి విజయాన్ని సాధించాడు. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బంగార్రాజు సినిమా బంపర్‌ వసూళ్లను రాబడుతోంది. చాలా కాలం తరువాత అటు అక్కినేని నాగార్జున కు భారీ హిట్‌ దక్కింది. కళ్యాణ్‌ కృష్ణ చాలా తక్కువ సమయంలోనే పక్కా పండగ సినిమా అంటూ ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకు వచ్చాడు.

ఈ సినిమా ను గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు కళ్యాన్‌ కృష్ణ. ఈ నేపథ్యంలోనే దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ తరువాతి మూవీ ఎవరితో.. ఏ బ్యానర్‌ లో ఉండనుందనేది ఆసక్తికరంగా మారంది. ఆయన తదుపరి సినిమా తమిళ నిర్మాత తో ఉండనుందని ఫైనల్‌ అయింది. కోలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్స్‌ లో జ్ఞానవేల్‌ రాజా ఒకరు. ఆయన బ్యానర్‌ లో కళ్యాణ్‌ కృష్ణ నెక్ట్స్‌ సినిమా చేయనున్నాడని ఓ వార్త అధికారికంగా బయటకు వచ్చింది. అయితే… ఈ సినిమాలో హీరో ఎవరనేదానిపై క్లారిటీ రాలేదు. ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version