ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్ హాస‌న్ డిశ్చార్జి

-

ఇటీవ‌ల క‌రోనా వైర‌స్ సోకిన క‌మ‌ల్ హాస‌న్ కొన్ని రోజుల క్రిత‌మే ఆస్ప‌త్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. కానీ తిరిగి ఈ నెల 17 న ఆస్ప‌త్రిలో చేరారు. దీంతో క‌మ‌ల్ హాస‌న్ అభిమానులు ఆందోళ‌న చెందారు. అయితే తాజా గా మంగ‌ళవారం రాత్రి ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్ హాస‌న్ డిశ్చార్జి అయ్యారు. కాగ కేవ‌లం రెగ్యూల‌ర్ వైద్య ప‌రీక్ష‌ల కోసంమే క‌మ‌ల్ హాస‌న్ ఆస్ప‌త్రిలో చేరినట్టు తెలుస్తుంది. క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత ఆయ‌న ఈ నెల 17న పోరూర్ లోని ఒక ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష కోసం చేరారు.

క‌మ‌ల్ హాస‌న్ కు అన్ని వైద్య ప‌రీక్ష చేసిన త‌ర్వాత ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నాడ‌ని వైద్యులు తెలిపారు. దీంతో క‌మ‌ల్ హాస‌న్ మంగ‌ళ వారం రోజు సాయంత్రం స‌మ‌యంలో ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయి త‌న సొంత ఇంటికి వెళ్లాడు. అయితే క‌మ‌ల్ హాస‌న్ పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి కావ‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగ క‌మ‌ల్ హాస‌న్ కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న త‌ర్వాత త‌న సినిమా షూటింగ్ ల‌లో పాల్గొంటార‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version