కమల్‌ క్రేజీ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగిన మరో హీరో..?

-

మణిరత్నం దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’.ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది.ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు . థగ్‌ లైఫ్ చిత్రాన్ని కమల్ హాసన్‌-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌, మద్రాస్ టాకీస్‌,రెడ్ జియాంట్ మూవీస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుంచి జయం రవి వైదొలగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డేట్స్ విషయంలో క్లాష్‌ రావడంతో ఆయన పక్కకు జరిగారని తెలుస్తోంది. ఇదే కారణంతో దుల్కర్‌ సల్మాన్‌ కూడా ఈ సినిమాని వదులుకున్నారని ఇటీవల వార్తలు బాగా వినిపించాయి.దుల్కర్‌ స్థానంలో చిత్ర యూనిట్ శింబును తీసుకునే ఆలోచనలో ఉందని.. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని సమాచారం. ‘థగ్‌ లైఫ్‌’ గురించి వస్తోన్న ఈ వరుస కథనాలపై చిత్రబృందం స్పందించలేదు.

‘పొన్నియిన్‌ సెల్వన్‌ -1, 2’ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సముద్రపు దొంగల నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version