కామారెడ్డి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కామారెడ్డిలోని చెరువులో మునగడం తోనే ఆ ముగ్గురు మృతి చెందినట్లు చెబుతున్నారు. ఆ ముగ్గురి ఒంటి పై ఎలాంటి గాయల్లేవని తేల్చింది పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక. అటు ఫోరెన్సిక్ రిపోర్ట్…కీలకంగా మారింది. ప్రత్యక్ష సాక్షులు, కీలక ఆధారాలు లేకపోవడం తో సాంకేతిక సాయం తో విచారణ చేస్తున్నారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ నుంచి ఆడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వరకు సీసీ ఫుటేజ్ ల పరిశీలన కొనసాగుతోంది.
ఎస్.ఐ. సాయికుమార్ రెండు ఫోన్లు, కానిస్టేబుల్ శృతి ఒక్క ఫోన్, నిఖిల్ రెండు వాడినట్లు గుర్తించారు. కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ ల మధ్య అత్మహత్య పై చాటింగ్ జరిగినట్లు గుర్తించారు. ఎస్.ఐ. వ్యక్తిగత ఫోన్ లాక్ తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షులు, ఆధారాలు లేకపోవడం తో ఇంకా త్రీ సూసైడ్స్ మిస్టరీ వీడలేదు. ఇక నేడు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.