కామారెడ్డిలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు రైతులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు తొలగించారు. కలెక్టరేట్ వద్ద రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఆందోళనలో ఇద్దరు మహిళలు, రైతు సొమ్మసిల్లిపడిపోయారు. తోపులాటలో కానిస్టేబుల్‌కు స్వల్పగాయాలయ్యాయి.
కలెక్టరేట్ గేటుకు పోలీసులు వేసిన తాళాన్ని రైతులు తొలగించారు. గేటు దూకి కలెక్టరేట్‌లోకి కొందరు రైతులు వెళ్లారు. కామారెడ్డి కలెక్టర్ ముందు రైతులు బైఠాయించారు. రైతులతో కలిసి బైఠాయించిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు ధర్నాలో పాల్గొన్నారు.
“ఎక్కడైతే వ్యవసాయం నడవదో.. రాళ్లు గుట్టలు ఉంటాయో అక్కడే పరిశ్రమలు పెడతామని మీరు ప్రకటనలు చేయండి. మేం శాంతియుతంగా రైతులను ఇళ్లకు తీసుకువెళ్తాం. వ్యవసాయానికి పనికిరాని భూములనే పరిశ్రమలకు కేటాయించాలి.కేటీఆర్… ఇండస్ట్రీయల్ జోన్లను మార్చి.. రెసిడెన్షియల్‌గా మార్చి సంతకం పెట్టారు.” – ఎమ్మెల్యే రఘునందన్‌రావు