నిత్యామీనన్ ని కంగన రనౌత్ తట్టుకుంటుందా …?

-

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. దివంగత జయలలిత జీవితంపై ప్రస్తుతం బయోపిక్స్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ తో పాటు రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. అందులో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’ ఒకటి…కాగా నిత్యా మీనన్ నటిస్తున్న ‘ది ఐరన్ లేడీ’ సినిమా ఒకటి. ఇక ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రను బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కొంతమంది కోలీవుడ్ జనాలు కంగన ని నిత్యా మీనన్ తో పోల్చుకుంటున్నారు.

 

తమిళ ప్రజలకు ప్రాంతీయ అభిమానం ఎక్కువగా కావడం తోనే ఇలా రెండు పాత్రలని కంపేర్ చేస్తున్నారట. అయితే కంగనా అలా తమిళ నటి కాకపోవడం ఒక కారణం అయితే తను బాలీవుడ్ హీరోయిన్ కావడం మరోకారణం. జయలలిత గా ఇద్దరి పోస్టర్స్ ని పక్క పక్కన పెట్టి చూస్తే నిత్యా మీనన్ సెట్ అయినంత పర్ఫెక్ట్ గా కంగన సెట్ అవలేదంటూ మాట్లాడుకుంటున్నారు. ‘ది ఐరన్‌ లేడీ’ పేరుతో వస్తున్న ఈ సినిమాకి ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. కంగన కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అందుకే జయలలిత పాత్రలో కంగన లాంటి స్టార్ హీరోయిన్ నటిస్తే సినిమాకి పాన్ ఇండియా క్రేజ్ బాగా వస్తుందని ఫీలవుతున్నారట.

 

ఆ ఆలోచనతోనే దర్శక నిర్మాతలు కంగనాను ఎంచుకున్నారు. అయితే తమిళనాడు లో ఈ విషయంలో బాగా వ్యతిరేకత ఉందని తెలుస్తుంది. మరి ఈ రెండు సినిమాలలో ఏది హిట్ అవుతుందో చూడాలి అంటూ కోలీవుడ్ జనాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక నిత్యా మీనన్ మాత్రం జయలలిత గెటప్ లో అద్భుతంగా కనిపిస్తుందని పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక నటన పరంగా కూడా నిత్యా మీనన్ యూనిక్ గా ఉంటారు.

ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పాత్ర నచ్చితే ఎంతగా అయినా నటించడానికి తాపత్రయపడతారు. అందుకే ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. అయితే వాస్తవంగా కూడా నేం అండ్ ఫేం ఉన్నప్పటికి నేచురల్ గా కనిపిస్తున్న నిత్యా మీనన్ ని కంగన తట్టుకుంటుందా అన్నది కూడా కాస్త అనుమానంగానే ఉందంటున్నారు విశ్లేషకులు. ఇక జయలిల బయోపిక్ ని వెబ్ సిరీస్ గా తెరకెక్కిస్తుండగా రమ్యకృష్ణ ఇందులో జయలలిత గా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version