ఆ విమర్శలు చేసే హక్కు ఈ జన్మకు లేదేమో బాబు!

-

ఇతరులకు చెప్పేటందుకే నీతులు ఉన్నాయి… అన్న చందంగా తాజాగా చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ నిరూపించే ప్రయత్నం చేశారు! అసలు ఏమి మాట్లాడుతున్నాం… మనం మాట్లాడిన మాటలు జనం వింటే ఏమనుకుంటారు? మనం నేడు మాట్లాడుతున్న మాటలు.. నాటి మన సంగతులను జనాలకు గుర్తుచేయవా? అని ఏమాత్రం ఆలోచన లేకుండా… నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నచందంగా ముందుకుదూసుకుపోతున్నారు!!

తాజాగా ప్రెస్ మీట్ పెట్టి సత్యాసత్యాలతో ఏమాత్రం సంబందం లేకుండా… తాను చేసిన విమర్శలకు పత్రికా ముఖంగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా కూడా… ఊకదంపుడు ఉపన్యాశంతో ప్రభుత్వంపై విమర్శలు చేశారు చంద్రబాబు! ఈ సమయంలో ఆయన ఎత్తుకున్న ఒక అంశం… కొత్తగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను తమిళనాడునుంచి తీసుకురావడం! బాద నిమ్మగడ్డ రమేశ్ ను తీసేయడం అయినప్పటికీ… ఆ పెయిన్ ఫేస్ లో కనిపించకుండా మేనేజ్ చేసిన చంద్రబాబు… ఇంతోటి దానికి ఎక్కడినుంచో తీసుకురావాలా? ఆమాత్రం అధికారులు ఇక్కడ లేరా? అన్నట్లుగా మాట్లాడటం కలకలం రేపింది!

ఈ మాటలతో చంద్రబాబుకి ఇంకా దళితులపై చిన్న చూపు పోలేదేమో అనే సందేహాలు వెలువడుతుండగా… జగన్ ఎన్నికల కమిషన్ గా తీసుకువచ్చిన వ్యక్తి ఒక మాజీ హైకోర్టు జడ్జి అనే విషయం బాబూకు తెలియదేమో అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకే దేశంలో అది కూడా పక్కనే ఉన్న రాష్ట్రంలో ఉన్న ఒక ఉన్నత న్యాయస్థానంలో జడ్జిగా పనిచేసిన వ్యక్తికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా తీసుకొస్తే… ఎక్కడినుంచో తేవాలా అనేస్థాయిలో మాట్లాడటానికి అసలు బాబుకు ఆ హక్కు ఉందా అని అంటున్నారు ఏపీ వాసులు, విశ్లేషకులు! గవర్నర్లు, డీజీపీలు, ఎస్పీలు, సీఎస్ లు, కమిషనర్ లు, ఇలా మొదలైన ఉన్నత స్థానాల్లో ఉండే అధికారులకు, వ్యక్తులకు కూడా రాష్ట్ర భేదాలు, ప్రాంతీయ భేదాలూ ఉంటాయా? అజ్ఞానం కాకపోతే!!

ఆ విషయాలు అలా ఉంటే… కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేపట్టడానికి రాష్ట్రంలోనూ, పోని దేశం మొత్తంమీద కూడా సమర్ధులు ఎవరూ లేరన్నట్లుగా… దేశాన్ని, దేశ తెలివితేటలను, దేశ సామర్ధ్యాన్ని తక్కువచేసి.. కాళ్లు కాలిన పిల్లిలా ప్రపంచం మొత్తం ప్రత్యేక విమానం వేసుకుని తిరిగిన చంద్రబాబు… ఎన్నికల కమిషనర్ గా పక్క రాష్ట్రం నుంచి ఒక ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తిని తీసుకురావడంపై తెగ ఫీలయిపోతుండటం హాస్యాస్పథం కాక మరేమిటి? ఈ విషయంలో అలాంటి ఫీలింగ్స్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు ఈ జన్మకు లేదు అనే విషయం ఆయన మరిచిపోకూడదనే చెప్పుకోవాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version