గుజరాత్ ఎన్నికల బరిలో ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ?

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని ఆ తర్వాత ఇండస్ట్రీలోని పలు సమస్యల పైన ఎటువంటి భయం లేకుండా మాటల దాడి చేసే ఫైర్ బ్రాండ్ గా సమాజంలో గుర్తింపును తెచ్చుకుంది కంగనా రనౌత్. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ మరియు నెపోటిజం అంశాలపైన చాలా మందిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించి ఎందరో మహిళా నటులకు దైర్యం వచ్చేలా చేసింది. ఇక కంగనా తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.. హీరోయిన్ గా రాణించిన కంగనా కన్ను ఇప్పుడు రాజకీయాలపై పడినట్లు తెలుస్తోంది. గుజరాత్ లో త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో కంగనా బీజేపీ తరపున పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమె తాజాగా కామెంట్ చేస్తూ శ్రీకృష్ణుడి కృప ఉంటే గుజరాత్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని పోస్ట్ చేశారు.

గత మూడు రోజుల క్రితం గుజరాత్ లోని యోగి ఆదిత్య నాధ్ ను కూడా కలవడం తెలిసిందే. మరి ఈమె ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే మాత్రం అధికారికంగా ప్రకటిస్తేనే ?

Read more RELATED
Recommended to you

Exit mobile version