కంగనా సంచలన వ్యాఖ్యలు.. అసలు నేరస్తుడు కరణ్ జొహారే..!

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రముఖ ఫిలింమేకర్ కరణ్ జొహార్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సినీ మాఫియాకు సంబంధించి అసలు నేరస్తుడు కరణ్ జొహారేనని కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేకమంది జీవితాలను, కెరీర్లను నాశనం చేసిన తర్వాత కూడా అతడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అసలు అతడిపై చర్యలు తీసుకునేది జరిగే పనేనా? అని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఈ వ్యవహారం అంతా సద్దుమణిగాక కరణ్, క్రూరమృగాల వంటి అతని గ్యాంగ్ సభ్యులు నావైపు దృష్టి సారిస్తారు’ అంటూ కంగనా ట్వీట్ చేశారు.

అలాగే గతంలో కూడా కరణ్ జొహార్‌కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కంగనా కోరారు. అదేవిధంగా యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినీ కెరీర్‌‌ను కరణ్ నాశనం చేశాడని, తద్వారా అతడి ఆత్మహత్యకు పరోక్ష కారకుడయ్యాడని గతంలో కంగనా రనౌత్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version