విజయసాయి లాక్ డౌన్ తర్వాత కాణిపాకంలో ప్రమాణం : కన్నా

-

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి, వైసీపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని ఆధారంగా చూస్తే రెండు పార్టీల మధ్య దూరం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సిఎం జగన్ కి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా సానుకూలంగా ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య దూరం క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది.

కరోనా టెస్ట్ కిట్స్ మధ్య చెలరేగిన వివాదం ఇప్పుడు తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. కరోనా టెస్ట్ కిట్స్ ఎక్కువగా కొన్నారని జగన్ సర్కార్ పై కన్నా లక్ష్మీ నారయణ ఆరోపణలు చేసారు. ఇక విజయసాయి రెడ్డి దీనిపై స్పందించారు. ఏపీ బిజెపి కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు, కన్నా అవినీతి పరుడు అంటూ విజయసాయి ఆరోపించారు.

కన్నా 20 కోట్లకు కచ్చితంగా అమ్ముడు పోయారని వ్యాఖ్యానించిన ఆయన, తప్పుడు పత్రాలతో సుజన చౌదరి, కన్నా లక్ష్మీ నారాయణ లోన్స్ తీసుకున్నారని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. తాను అవినీతి చేయలేదు అని కాణిపాకం లేదా తిరుమల మీద ప్రమాణం చేస్తా అని కన్నా కూడా చెయ్యాలి అంటూ ఆయన సవాల్ చేసారు. ఇప్పుడు బిజెపి వైసీపీ మధ్య దూరం పెరిగితే ఫలితంగా జగన్ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందుకే వైసీపీ కార్యకర్తలు విజయసాయి ని కాస్త కట్టడి కావాలి అంటూ కోరుతున్నారు. తాజాగా దీనిపై కన్నా స్పందించారు. లాక్ డౌన్ అయిన తర్వాత తాను తేదీ చెప్తా అని కాణిపాకంలో ప్రమాణం చేయడానికి రెడీ గా ఉండాలని, ఎవరు అవినీతి చేసారో ఎవరు చేయలేదో అప్పుడే తెలుస్తుందని కన్నా సవాల్ చేసారు. ఏది ఎలా ఉన్నా ఈ మాటల యుద్ధం ఇప్పట్లో ఆగే విధంగా కనపడటం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version