సీనియర్ నటుడికి సీరియస్.. ఐసీయూ లో చికిత్స..!

-

కన్నడ సీనియర్ నటుడు సత్యజిత్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం సత్యజిత్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా సత్యజిత్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇటీవల ఆయనకు జాండీస్ రావడంతో పాటు శుక్రవారం గుండెపోటు వచ్చింది. దాంతో వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన గత కొద్ది రోజులుగా బీపి.. షుగర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

దాంతో ఆయన శరీరం చికిత్సకు స్పందించడం లేదని కుమారుడు ఆకాష్ జిత్ వెల్లడించారు. చికిత్సకు అయ్యే ఖర్చు కోసం ప్రభుత్వం, ఫిలిం ఛాంబర్ సహాయం చేయాలని ఆకాష్ జిత్ కోరుతున్నారు. ఇదిలా ఉండగా కన్నడ ఇండస్ట్రీ లో సీనియర్ నటుడిగా సత్య జిత్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. 650 చిత్రాలకు పైగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. నెగిటివ్ పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్యజిత్ గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడలో పటేల్, దుర్గ టైగర్, పోలీస్ స్టోరీ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో సత్యజిత్ కు మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version