డ్రగ్స్‌ కలకలం : ప్రముఖ న‌టి అరెస్ట్‌..!

-

సినీ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతుంది. తాజాగా క‌న్నడ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల వాడకానికి సంబందించిన స‌మాచారాన్ని కొందరు సీసీబీకి అందించారు. ఈ నేపథ్యంలో నటి రాగిణిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు నుండి సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు ఈ రోజు ఉద‌యం రాగిణీ నివాసానికి చేరుకుని త‌నిఖీలు చేసారు. అలాగే నటి రాగిణి ద్వివేది ఉపయోగిస్తున్న నాలుగు మొబైల్ ఫోన్లను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు మొబైల్స్ లోని కాల్ డేటాను సీసీబీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిసింది.

కాగా రాగిణి సన్నిహితుడు రవిశంకర్‌ను సీసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇదే కేసులో నటి అనికాను ఎన్ సీబీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో దాదాపు 15 మంది టాప్ యాక్టర్లకు, డైరెక్టర్లకు, మ్యూజిక్ డైరెక్టర్లకు డ్రగ్ సప్లయిర్లతో సంబంధాలున్నాయనే విషయం బయటకు వచ్చినట్టు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version