ఓటీటీలోకి వ‌స్తున్న క‌న్న‌డ బ్లాక్ బస్టర్ మూవీ ‘బ్యాచిల‌ర్ పార్టీ’

-

అభిజిత్ మహేష్ ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డ స్టార్ హీరో సప్త సాగరాలు దాటి ఫేమ్ ర‌క్షిత్ శెట్టి నటించిన తాజా చిత్రం ‘బ్యాచిల‌ర్ పార్టీ’ .ర‌క్షిత్ శెట్టి సొంత ప్రోడ‌క్ష‌న్ సంస్థ‌ పరమవా స్టూడియోస్ బ్యాన‌ర్ లో వచ్చిన ఈ సినిమాలో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగి, సిరి రవికుమార్ కీలక పాత్ర‌ల్లో న‌టించారు.

కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 26న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యం సొంతం చేసుకుంది.ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ ఓటీటీ లాక్ చేసుకుంది.ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ మార్చి 04 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ ఓటీటీ స్ట్రీమింగ్ అనేది కేవలం కన్నడ వరకే ఉంటుందా? తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పరమ్ వహ్ స్టూడియోస్ బ్యానర్‌పై జీఎస్ గుప్తా ,రక్షిత్ శెట్టి నిర్మాతలుగా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news