కరోనా వైరస్‌పై సినిమా.. టైటిల్‌ ఏమిటంటే..?

-

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ వల్ల 4633 మంది చనిపోయారు. కొన్ని లక్షల మందికి కరోనా సోకినట్లు నిర్దారించారు. ఇక అనేక దేశాలు ఇప్పటికే విదేశీ ప్రయాణాలను నిషేధించాయి. అయితే కరోనా వైరస్‌ ప్రభావం ఇలా ఉంటే.. మరోవైపు దీనిపై సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు.

కన్నడ దర్శకుడు ఉమేష్‌ భనకర్‌ డెడ్లీ కరోనా పేరిట ఓ టైటిల్‌ను రిజిస్టర్‌ చేశారు. అందులో కరోనా అసలు ఎక్కడ నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ప్రపంచం దాన్ని ఎలా ఎదుర్కొంది అనే విషయాలను చూపించనున్నారని తెలిసింది. ఇక ఈ సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేయాలని చూస్తున్నారు.

అయితే కరోనా వైరస్‌ కాకపోయినా.. అలాంటి నేపథ్యం ఉన్న హాలీవుడ్‌ సినిమాలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. తెలుగులో సూర్య సెవెన్త్‌ సెన్స్‌ సినిమాలోనూ ఓ వైరస్‌ను చూపించారు. అది కూడా చైనాలోనే కావడం విశేషం. మరి ఇప్పుడు తాజాగా ఉమేష్‌ తీయనున్న డెడ్లీ కరోనా సినిమా ఏ మేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version