ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. ఎక్కడిక్కడ ప్రజలను కరోనా ఇళ్ళ నుంచి బయటకు రానీయడం లేదు. ఇటలీ లో ఆరు కోట్ల మంది బయటకు రావడం లేదు. దాదాపు వంద దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. దీనితో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ప్రాణ భయంతో ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నారు. అమెరికా లో కూడా కరోనా ప్రభావం చూపిస్తుంది.
ఇప్పటికే 40 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో కరోనా బాధితులు 68కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 25 వేల మందికి ఈ వైరస్ సోకింది. హాలీవుడ్ దంపతులు టామ్ హంక్స్, అతని భార్య రీటా విల్సన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆస్ట్రేలియాలో సినిమా షూటింగ్‌లో ఉండగా.. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో ఇబ్బంది పడ్డారు. వెంటనే ఆస్పత్రికి పరిక్షలు చేయించుకున్నారు.
ఈ పరీక్షల్లో వీరికి కరోనా ఉన్న విషయం బయటపడింది. దీనితో ఒక్కసారిగా అమెరికా ప్రజల్లో ఆందోళన మొదలయింది. కరోనా ప్రముఖులకు కూడా సోకడంతో అమెరికా సహా అన్ని దేశాల ప్రజలు ఇప్పుడు అప్రమత్తమవుతున్నాయి. ఈ వైరస్ ని మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అయితే కొందరి అంచనాల ప్రకారం ఈ వైరస్ కోటి మందికి సోకే అవకాశం ఉందని అంటున్నారు.