అభిమానులకు లేఖ రాసిన కన్నడ స్టార్ హీరో.. ఏమని అంటే..

-

కన్నడ స్టార్ హీరో తన అభిమానుల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ వస్తారు ఈ విషయాన్ని ఇప్పటికే వాళ్లు సందర్భాల్లో నిరూపించుకున్నారు.. బయట ఎక్కడ కనిపించినా అభిమానులకు ఎంతో ప్రేమగా సెల్ఫీలు ఇస్తూ కనిపిస్తారు.. ఇప్పటివరకు తన ప్రతి పుట్టినరోజును అభిమానులతోనే జరుపుకుంటూ వస్తున్నాడు ఈ హీరో అయితే తాజాగా జనవరి 8న అతను పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో జరుపుకునే అవకాశం లేదంటూ ఒక లేఖ రాసుకొచ్చారు..

కన్నడ స్టార్ హీరో తాజాగా తన అభిమానులకు రాసిన లేక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ పుట్టినరోజును అభిమానులతో జరుపుకోవాలేక పోతున్న అంటూ చెప్పుకొచ్చాడు ఈ హీరో.. అలాగే ఏడాది అందుబాటులో ఉండలేకపోతున్నానని కానీ మీ అందరిని ఎంతగానో మిస్ అవుతున్నా అంటూ తెలిపాడు..

అయితే ఈ లేఖలో ఏం రాసుకోవచ్చారు అంటే.. “ఏడాది పొడవునా నాపై అభిమానం చూపిస్తూ.. నా పుట్టినరోజు సందర్భంగా మీరు చూపించే ప్రేమ, ఆప్యాయతలు నా హృదయాన్ని కృతజ్ఞతతో నింపేస్తుంది. సంవత్సరమంతా మీరు చూపించే ప్రేమని.. ఎంతో కొంత మీకు తిరిగి ఇవ్వడానికి నా పుట్టినరోజున మిమ్మల్ని కలవడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం నా పుట్టినరోజున నేను సిటీలో ఉండటం లేదు. అందుకే ఈసారి నేను మీ అందరినీ కలవలేకపోతున్నా అన్నారు. కానీ మాట ఇస్తున్నా.. మిమ్మల్ని తప్పకుండా త్వరలో కలుస్తాను.. ” అంటూ చెప్పకొచ్చారు హీరో యశ్..

ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆయన అభిమానులు తమ ఇష్టమైన హీరోని పుట్టినరోజు సందర్భంగా కలవలేకపోయినందుకు బాధపడుతున్నప్పటికీ అతని మంచి మనసుకు మరొకసారి ప్రశంసల వర్షం కురిపించారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version