పీరియడ్స్ సమయంలో మనం ఎంతగానో సఫర్ అవ్వాల్సి వస్తుంది. పీరియడ్స్ లో కడుపునొప్పి, వికారం, మానసిక సమస్యలు ఇలా వివిధ రకాల సమస్యలతో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే మహిళలు పీరియడ్స్ సమయంలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని తప్పులు వలన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
అలాంటి సమస్యలేమి లేకుండా ఉండాలంటే మహిళలు ఈ చిట్కాలని తప్పక అనుసరించాలి. మహిళలు కనుక పీరియడ్స్ అప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదంలో పడ్డట్టే. మరి ఎలాంటి జాగ్రత్తలని మహిళలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి నాలుగు నుండి ఆరు గంటలకే ప్యాడ్స్ ని మార్చుకుంటూ ఉండాలి:
ప్రతి నాలుగు నుండి ఆరు గంటలకి సానిటరీ ప్యాడ్ ని మార్చుకోవాలి. దీని వలన ఇన్ఫెక్షన్స్ రావు. రుతుస్రావం రక్తం శరీరం లో ఉండే వివిధ రకాల బ్యాక్టీరియాలని ఆకర్షిస్తుంది దీనివలన ఇన్ఫెక్షన్స్ వంటివి వస్తాయి కాబట్టి ఈ తప్పును చేయొద్దు.
సోప్స్ లేదా కెమికల్ ప్రొడక్ట్స్ ని వాడొద్దు:
చాలామంది వివిధ రకాల ప్రోడక్ట్లని పీరియడ్స్ సమయంలో ఉపయోగిస్తారు. వీటివలన సమస్యలు రావచ్చు. పరిశుభ్రత కలిగించే ఉత్పత్తులని వాడడం వలన ప్రయోజనమే కానీ కొన్ని కొన్ని సార్లు ఇవి ప్రమాదకరం.
సానిటరీ ప్యాడ్ ని సరిగ్గా డిస్పోస్ చేయండి:
ఎప్పుడూ కూడా ప్యాడ్స్ ని ఫ్లెష్ చేయకూడదు. సూక్ష్మ క్రిములు వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వీటిని పారేయాలి. ఒక పేపర్ ని కానీ లేదంటే ఏదైనా కవర్ ని కానీ తీసుకొని కానీ రోల్ చేసి దానిని పాడేయండి. పడేసిన తర్వాత మీ చేతులని శుభ్రంగా కడుక్కోండి. సిలికాన్ కప్స్ వాడాలి అనుకునే వాళ్ళు వాడొచ్చు. ఇవి సురక్షితమే వీటిని బాగా క్లీన్ చేసుకుంటూ మీరు రెండేళ్ల వరకు ఉపయోగించవచ్చు అయితే మీరు కప్ ని ఉపయోగించేటప్పుడు గైనకాలజిస్ట్ ని సంప్రదించడం మంచిది.