హుజురాబాద్‌ అభ్యర్థులకు షాక్‌.. ఆ సర్టిఫికేట్‌ ఉంటే పోటీకి అర్హులు !

-

హుజురాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఖరారు కావడంతో మార్గదర్శకాలను విడుదల చేశారు కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్. ఈ మేరకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మీడియాతో మాట్లాడుతూ… హుజురాబాద్ ఆర్డీవో రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉంటారని… హుజురాబాద్ వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలిపారు. హుజురాబాద్ లో 70 సింగిల్ వ్యాక్సినేషన్ జరిగింది 50 శాతం సెకండ్ వ్యాక్సినేషన్ జరిగిందని… అక్టోబర్ 30న ఎన్నిక జరుగుతుందన్నారు. నవంబర్ 2 న కౌంటింగ్ జరుగుతుందని… సోషల్ డిస్టెన్స్ మాస్క్ తో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.

Huzurabad | హుజురాబాద్

వీణవంక, జమ్మికుంట, హుజురాబాద్, కమలాపూర్, ఇళ్లందకుంట వ్యాప్తంగా ఎన్నికల ఆంక్షలుంటాయని… ఎలక్షన్ కోడ్ తక్షణమే అమలులోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పనిచేసే ఉద్యోగులకు పోలింగ్ ఏజెంట్లకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉండాలని… ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు సైతం వ్యాక్సిన్ వేపించుకోవాలని తెలిపారు.

నామినేషన్ అభ్యర్థులు పరిమితి సంఖ్యలో రావాలి కోవిడ్ అంక్షలు పాటించాలన్నారు. అనంతరం సిపి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు అందాయన్నారు. నాయకులు కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటించాలని… రాజకీయ పార్టీల ర్యాలీలకు సభలకు పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో తనిఖీలు జరుగుతాయని… మద్యం నగదు పంపిణీలపై పర్యవేక్షణ ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version