కరీంనగర్ నుండి తిరుపతి, తిరుచానూర్‌, కాణిపాకం.. ఈ IRCTC ప్యాకేజీ వివరాలు మీకోసం..!

-

ఐఆర్సీటీసీ ఎన్నో రకాల టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఇప్పుడు కొత్తగా కరీంనగర్ వాసులకు ఓ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా తిరుమల, తిరుపతి, తిరుచానూర్‌తో పాటు కాణిపాకం కూడా చూసి వచ్చేయచ్చు. ఇక మరి పూర్తి వివరాలని చూస్తే.. ఐఆర్సీటీసీ ఈ కొత్త ప్యాకేజీ ని తీసుకొచ్చింది. ప్రతి గురువారం ఇది అందుబాటు లో ఉంటుంది.

ఫిబ్రవరి 2న ఇది మొదలవుతోంది. ఫిబ్రవరి 2న సాయంత్రం 7:15 గంటలకు తిరుపతి కి రైలులో వెళ్లాల్సి వుంది. మరుసటి రోజు ఉదయం అక్కడికి రీచ్ అవుతారు. తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఐఆర్సీటీసీ ఏజెంట్ రిసీవ్ చేసుకొని హోటల్ కి తీసుకు వెళ్లారు. ఆ తరవాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలను చూసి వచ్చేయచ్చు. మధ్యాహ్నం శ్రీకాళహస్తి, తిరుచానూర్ చూసేసాక రాత్రి తిరుపతికి తీసుకొస్తారు.

మరుసటి రోజు ఉదయం తిరుమల దర్శనం అవుతుంది. సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్‌లో దించుతారు. రాత్రి 8:15 గంటలకు కరీంనగర్ రైలు లో వచ్చేయచ్చు. అంతే ట్రిప్ ముగుస్తుంది. ఇక ప్యాకేజీ ధర విషయానికి వస్తే.. కంఫర్ట్ క్లాస్ కి రూ.9,010 చెల్లించాల్సి వుంది.

డబుల్ షేరింగ్‌లో రూ.7,640, ట్రిపుల్ షేరింగ్‌లో రూ.7,560. చిన్నపిల్లలకు రూ.7,140. స్టాండర్డ్ క్లాస్ కింద సింగిల్ షేరింగ్‌కు రూ.7,120. డబుల్ షేరింగ్‌ రూ.5,740, ట్రిపుల్ షేరింగ్‌ రూ.5,660గా వుంది.
పూర్తి వివరాలని ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version