కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ మోదీ జీ : కేటీఆర్

-

బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయంలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా​ నిప్పులు చెరుగుతున్నారు. 11 మంది నిందితులను గుజరాత్​ ప్రభుత్వం విడుదల చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి కేటీఆర్​.. ఇప్పుడు మరోసారి స్పందించారు.

స్వాత్రంత్య్ర దినోత్సవం రోజునే 11 మంది దోషులను విడుదల చేయడాన్ని మంత్రి కేటీఆర్​ ఖండించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ జోక్యం చేసుకుని ఆ రేపిస్టులను విడుదల చేయకుండా.. కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి కూడా చేశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్​తో పాటు పలువురిని నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే.. బిల్కిస్‌బానో నిందితుల విడుదలపై ట్విటర్‌లో మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇస్తాయని పేర్కొన్నారు. సాధారణంగా అభివృద్ధి, భద్రత, సంక్షేమంపై హామీలు ఇవ్వడం చూశాం. ఇప్పుడు మహిళలు, చిన్నారులను చంపిన దోషులను విడుదల చేస్తున్నారని సెటైర్ వేశారు. ఇలాంటి ఖైదీల విడుదల, శిక్ష తగ్గింపు ఎప్పటికీ మరిచిపోలేనిదని ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘కర్మ ఈజ్ బూమరాంగ్’ అంటూ ట్వీటారు. కేటీఆర్‌ ట్వీట్‌కు నెటిజన్స్‌ నుంచి మద్దతు లభించింది. కొంత మంది సూపర్ సార్ అంటూ కామెంట్స్ పెట్టగా.. మరికొంత మంది నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version