బీజేపీలోకి కర్ణాటక డిప్యూటీ సీఎం.. డికే శివ కుమార్ క్లారిటీ!

-

కర్ణాటక అసెంబ్లీల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన డీకే శివకుమార్.. ప్రస్తుత డిప్యూటీ సీఎం పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. ఎట్టకేలకే డీకే శివకుమార్ స్పందించారు.

‘నేను కొన్ని మీడియా, సోషల్ మీడియాల్లో చూశాను. బీజేపీకి దగ్గరవుతున్నావా అని నా స్నేహితులు కాల్ చేసి అడుగుతున్నారు. నేను జన్మత: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. ఇక నేను మహా కుంభమేళాకు వెళ్లడంపై స్పందిస్తూ..మహాకుంభ్ సందర్శన నా విశ్వాసం.నేను అన్ని మతాలను గౌరవిస్తాను. బీజేపీకి దగ్గరవుతున్నాననే ఊహాగానాలు నాకు దగ్గరగా కూడా రావు. బీజేపీ ఆరోపణలను పెద్దగా పట్టించుకోను’ అని డీకే శివకుమార్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news