తెలంగాణలో భూగర్బ జలాలు అడుగంటిపోతున్నాయని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టంచేశాయి. ఇంకా వేసవి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని హైదరాబాద్ పరిధిలో నివసించే ప్రజలు తీవ్ర ఆందోళన చెందున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఫిబ్రవరి నెలలోనే తాగు నీటికి అవస్థలు పడితే సమ్మర్లో కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కురుమేడు గ్రామంలో తాగునీరు,కృష్ణ వాటర్ సరఫరా చేయడం లేదంటూ నాగార్జునసాగర్ రహదారిపై హైవేపై గ్రామస్తులు, మహిళలు ఖాళీ బిందెల చేతబట్టి నిరసనకు దిగారు. మిషన్ భగీరథ ట్యాంక్ లను నిరుపయోగంగా మార్చారని, తమకు గుక్కెడు మంచి నీళ్ళు అందించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.