కర్ణాటకలో 100కు పై స్థానాల్లో కాంగ్రెస్ జోరు.. ప్రియాంకా గాంధీ పూజలు

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 100కు పైగా స్థానాల్లో ఆధిపక్యం కొనసాగిస్తోంది.  తాజా స‌మాచారం ప్ర‌కారం క‌ర్ణాట‌క‌ అసెంబ్లీ ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీ  మ్యాజిక్ ఫిగ‌ర్ దాటేసింది. ఫ‌లితాలు వెలుబ‌డనున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఇవాళ షిమ్లాలోని హ‌నుమాన్ ఆల‌యంలో పూజ‌లు చేశారు.

ర్ణాట‌క‌లో కౌంటింగ్ సంద‌ర్భంగా ఆమె హ‌నుమాన్ గుడిలో ప్రార్థ‌న‌లు చేశారు. దేశం, క‌ర్ణాట‌క‌ ప్ర‌జ‌ల శాంతి, సామ‌ర‌స్యం కోసం ప్రియాంకా గాంధీ ప్రార్థిస్తున్న‌ట్లు కాంగ్రెస్ నేత‌లు తెలిపారు. షిమ్లాలోని జాకూ ఆల‌యంలో ఆమె పూజ‌లు చేశారు.

ఓవైపు కన్నడనాట కాంగ్రెస్ దూసుకెళ్తోంటే.. బీజేపీ మాత్రం అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. చివరి వరకు లెక్కలు తారుమారు కావొచ్చని చెబుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటినా మాదే అధికారం అంటూ జోస్యం చెబుతోంది. కన్నడ కస్తూరిని చేజిక్కించుకుంటామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఎలాగైనా ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఖాయమని అంటున్నారు. దాని కోసం ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version