కర్ణాటక ఫలితాలు.. కాంగ్రెస్‌ అభ్యర్థే గెలుస్తారంటూ రెండెకరాల పందెం

-

టిక్.. టిక్..టిక్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో రానున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో అభ్యర్థులపై బెట్టింగులు జరుగుతున్నాయి. హొన్నాళిలో కాంగ్రెస్‌ అభ్యర్థి శాంతనగౌడ గెలుస్తారని- బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్యదే విజయమంటూ పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. శాంతనగౌడ గెలుస్తారని నాగణ్ణ అనే వ్యక్తి తన రెండెకరాల పొలాన్ని పందేనికి ఉంచారు. ఎవరైనా పందెం కాసేవారు ఉంటే.. రావాలంటూ గ్రామంలో గురువారం రాత్రి చాటింపు వేయించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

మరోవైపు కొండసీమల చామరాజనగర జిల్లాలో అభ్యర్థుల విజయంపై జోరుగా బెట్టింగ్‌ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో సోమణ్ణ విజయంపై రూ.కోటి వరకు పందేలు కాసుకున్న వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. గుండ్లుపేట తాలూకా మల్లయ్యనపుర గ్రామానికి చెందిన కిరణ్‌ అనే వ్యక్తి తన చేతిలో రూ.3 లక్షలు పట్టుకుని కాంగ్రెస్‌ గెలుస్తుందంటూ పందెం కాశారు. వీడియో ఆధారంగా పోలీసులు అతని నివాసంపై దాడి చేసి, విచారణ చేపట్టారు. మరో వీడియోలో తాను చెబుతున్న అభ్యర్థులు గెలుస్తారని, ఎవరైనా రూ.కోటి పందెం కాయవచ్చంటూ ఒక వ్యక్తి సవాలు విసిరాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version