ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ

-

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ(92) తాజాగా ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే అనార్యోగంతో మణిపాల్ ఆస్పత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం ఐసీయూలో చిక్సిత పొందుతున్నారని డాక్టర్లు తెలిపారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ కృష్ణ ఏప్రిల్ 21వ తేదీన బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో చేరారు.

అనంతంరం ఏప్రిల్ 29వ తేదీన మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. స్పెషలిస్ట్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ సునీల్ కారంత్ నేతృత్వంలోని క్రిటికల్ కేర్ టీమ్ చికిత్స అందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె సుధాకర్ మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

పాత మైసూరు ప్రాంతంలోని మద్దూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎస్‌ఎం కృష్ణ అక్టోబర్ 11, 1999 నుంచి మే 28, 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనంతరం ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news