కర్ణాటక ప్రభుత్వం సంచల నిర్ణయం.. వాటిపై 2 శాతం సెస్ పెంపు

-

సినిమా టిక్కెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లపై 2 శాతం సెస్ విధించే ప్రతిపాదనలపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తుంది.దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సినీ కళాకారులు, సాంస్కృతిక ప్రదర్శనకారులకు ESI, PF వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలకు ఉపయోగించాలని భావిస్తుంది. దీనికి సంబంధించిన ఓ బిల్లును కూడా తాజాగా రూపొందించింది. సినీ, సాంస్కృతిక కళాకారుల సంక్షేమం బిల్లు- 2024ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా కళాకారులకు సామాజిక భద్రత, సంక్షేమాన్ని అందించడానికి ఉద్దేశించిన పథకాలకు ఆర్థిక సహాయం చేయడానికి ఒక నిధిని రూపొందించాలని అసెంబ్లీలో ప్రతిపాదించారు.

ఈ బోర్డులో వివిధ సాంస్కృతిక రంగాలు, అకాడమీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 17 మంది ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యులు, ఆ శాఖ మంత్రి, సీనియర్ ఐఏఎస్ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ సెస్ మొత్తం 2 శాతానికి మించబోదు. ప్రతి మూడు ఏళ్ళకి సెస్ మొత్తాన్ని సవరించేలా బిల్లుకు రూపకల్పన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version