హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ముసురు కంటిన్యూ అవుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది.దీంతో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్కు భారీగా వరద రావడంతో నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. చెరువు పూర్తి సామర్థ్యం 514 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.
నగరంలో ఉదయం నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షంతో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావటంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. నగరం శివారు ప్రాంతాల్లోనూ నిన్న సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది .బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.