కర్ణాటక రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ మరియు బీజేపీలు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ఎవరి మద్దతు లేకుండానే అధికారాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ రెండు పార్టీలు కాకుండా కుమారస్వామి ఆధ్వర్యంలో ఉన్న JDS కూడా గతంలో కాంగ్రెస్ కు మద్దతుగా ఉండి కాంగ్రెస్ అధికారంలో రావడానికి సహాయపడింది. ఈ ప్రభుత్వం సీఎం గా కుమారస్వామి కూడా ఉన్నారు. అయితే ఈ సారి మాత్రం కాంగ్రెస్ మరియు JDS లకు పొత్తు కుదరలేదు. అందుకే కుమారస్వామి NDA లో వెళ్లి కలవడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే NDA లోకి వెళ్లడం ఇష్టం లేదంటూ కర్ణాటక JDS అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం చెప్పారు అంతే కాకుండా ఒక పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకునే హక్కు నాకుందని ఇబ్రహీం మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలతో ఆగ్రహము తెచ్చుకున్న భారత్ మాజీ ప్రధాని మరియు JDS అధినేత దేవెగౌడ అతన్ని అధ్యక్ష పదవినుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. కాగా కుమారస్వామి అధ్యక్షతన తాత్కాలిక రాష్ట్ర కమిటీని ఫామ్ చేస్తున్నారు.