నలుగురు గుజరాత్ పోలీసులకు జైలు శిక్ష

-

గత ఏడాది అక్టోబర్‌ గుజరాత్ లో ఖేడా జిల్లాలోని ఉంధేలా వద్ద ముగ్గురు ముస్లింలను స్తంభానికి కట్టేసి బహిరంగంగా కొరడాలతో కొట్టినందుకు నలుగురు పోలీసులకు గుజరాత్ హైకోర్టు గురువారం 14 రోజుల జైలు శిక్షతో పాటు రూ. 2,000 జరిమానా విధించింది.
పోలీసులు బహిరంగంగా కొరడాలతో కొట్టడం అమానవీయం,మానవత్వానికి వ్యతిరేకమని పేర్కొంటూ, న్యాయమూర్తులు A S సుపేహియా, గీతా గోపిల ధర్మాసనం హింస లేదా అవమానం కలిగించే శారీరక,మానసిక నష్టాలను కూడా వివరించింది.

అరెస్టయిన వారికి జీవించే హక్కు ఉందని, అందులో గౌరవంగా జీవించే హక్కు కూడా ఉందని, అలాగే ఒక వ్యక్తిని అరెస్టు చేసిన తర్వాత దానిని ఉపేక్షించరాదని కోర్టు నమోదు చేసింది. నలుగురు గుజరాత్ పోలీసులకు ఆ రాష్ట్ర హైకోర్టు 14 రోజుల జైల శిక్ష విధిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ లో ఖేడా జిల్లాలోని ఉంధేలా వద్ద ముగ్గురు ముస్లింలను స్థంభానికి కట్టేసి పోలీసులు కొట్టారు. ఈ కేసుపై విచారించిన హైకోర్టు పోలీసుల తీరును తప్పుపట్టింది. జైలు శిక్షకు వ్యతిరేకంగా ఇన్ స్పెక్టర్ పర్మార్, ఎస్సై కుమావత్, హెడ్ కానిస్టేబుల్ ధాబి, కానిస్టేబుల్ రాజు వేసిన పిటిషన్ ను తిరస్కరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version