కార్తీకదీపం 1168 ఎపిసోడ్: జైలునుంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్న మోనిత ..ఇంట్లోంచి లగేజ్ తో వచ్చేసిన హిమ-శౌర్యలు

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ మోకాళ్ల పై కుర్చుని హిమ నువ్వు తప్పుగా అర్థంచేసుకుంటున్నావ్, నా మాట నమ్మరా అంటూ దన్నం పెడతాడు. నన్ను అర్థంచేసుకో, నేను ఏ తప్పు చేయలేదురా అంటాడు. కానీ ఈ హిమ నమ్మదు. మీరే అబద్ధం చెప్తున్నారు అని వెళ్లిపోతుంది. కార్తక్ పాపం అక్కడే కుర్చుంచడిపోయి బాధపడతాడు. బ్యాక్ గ్రౌండ్ లో సాడ్ సాంగ్.

జైల్లో మోనిత ఆసుపత్రిలో జరగిన సీన్ గుర్తుచేసుకుంటుంది. దీపక్కా నీ పని అయిపోతుంది. హిమ చూసింది, ఇంట్లో అందరూ ఈ మోనిత గురించే మాట్లాడుకుంటారు. కార్తీక్ నన్ను రెండోభార్యగా ఒప్పుకోవటం తప్ప మరో మార్గంలేదు మీకు అనుకుంటూ వెకిలినవ్వు నవ్వుతుంది.

కార్తీక్ దిగాలుగా కుర్చుని హమ అన్న మాటలను తలచుకుంటాడు.విన్నావ్ కదా మమ్మీ అదేం మాట్లాడింది. నా పిల్లలను చిన్నపిల్లలే కదా అనుకున్నాను కానీ వాళ్లు పెద్ద పెద్దమాటలు మాట్లాడే పెద్దొళ్లు అయిపోయారు. మోనిత హాస్పటల్ కి వచ్చినట్లు అది చూసినట్లు నాకు తెలియదు మమ్మీ అంటాడు. దీపకు చెప్పొచ్చుకదారా అని సౌందర్య అంటుంది. మిమ్మల్ని టెన్షన్ పెట్టటం ఎందుకని చెప్పలేదు అంటాడు. ఆదిత్య ఇదే ఈ కొంపలో కొంపముంచుతుంది..ఎవరి మనసులో మాటను వాళ్ల మనసులో పెట్టుకుంటే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది. నా మాట విని పిల్లలకు జరిగింది చెప్పేసి అందరూ అమెరికాకు వెళ్లిపోండి అని ఆదిత్య చెప్పేసి వెళ్లిపోతాడు. మోనిత శిక్షపడి జైల్లో నుంచి ఆసుపత్రిలోకి ఎలా వచ్చింది అని సౌందర్య అడుగుతుంది. హాట్ ఎటాక్ వచ్చినట్లు నాటకం ఆడి వచ్చింది అని కార్తీక్ చెప్తాడు. అలా ఆసుపత్రిలో జరిగింది కార్తీక్ దీపకు, సౌందర్యకు చెప్తాడు. ఆ మోనిత రావటం, హిమ వినటం ఇదంతా నా బ్యాడ్ టైం కాకపోతే ఏంటి మమ్మీ అంటాడు కార్తీక్. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి అంటుంది సౌందర్య. దీప వెళ్లిపోతుంది. కార్తీక్ ఏంటి మమ్మి దీప ఏం మాట్లడకుండా వెళ్లిపోతుంది అంటాడు. ఏం మాట్లడకలదు రా..అంటూ దీప వ్యక్తిత్వం గురించి చెప్తుంది సౌందర్య.

కింద దీప ప్లేట్స్ తుడుచుకుంటూ ఉంటుంది. హిమ వచ్చి మనం ఈ ఇల్లువదిలేసి బస్తీకి వెళ్లిపోదాం అమ్మా, ఈ ఇల్లు నాకు నచ్చటం లేదు, డాడీ బాడ్ బాయ్ అంటుంది. ఏంటమ్మా నువ్వు అంటూ దీప హిమను బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. డాడీ తప్పుచేశాడు కదా, అన్నీ తెలిసి కూడా సైలెంట్ గా ఎందుకు ఉన్నావ్ అమ్మా అంటుంది. దీప హిమ చేయి పట్టుకోబోతుంది. హిమ పక్కకు లాగేసరికి ప్లేట్ కిందపడి ముక్కలు అయిపోతుంది. దీప బంధాలు కూడా ఇలాంటివే, ఒక్కసారి ముక్కలైతే అతికించటం కష్టం ఇవన్నీ మీకు చెప్పినా అర్థంకావు అందుకే కొన్ని చెప్పకుండా ఉంటాం అని కిందపడిన ప్లేట్ ముక్కలను తీస్తుంది.

ఇంకోవైపు జైల్లో మోనిత జైలర్ తో పెరోల్ మీద బయటకువచ్చే ఏర్పాట్లు చేస్తుంది. ఏ మాత్రం అవకాశం లేదా మేడమ్..ఈ మంచితనం, సత్ ప్రవర్తన అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ వేస్తుంది. సెంటిమెంట్ తో పడగొట్టాలని చూస్తుంది. ఒట్టి మనిషిని కూడా కాదు..నన్ను ఈ జైల్లోంచి పంపండి మేడమ్ అంటూ అబ్బో వీర లెవల్లో యాక్ట్ చేస్తుంది. అవకాశం ఉంటే చెప్తాను అని జైలర్ చెప్తుంది. దీన్ని బట్టి మోనిత శిక్షాకాలం పూర్తికాకుండానే బయటకువచ్చేలా ఉంది.

ఇంట్లో కార్తీక్ రూంలో ఒంటరిగా కుర్చుని పొద్దున హిమ అన్న మాటలనే తలుచుకుంటూ ఉంటాడు. సౌందర్య వచ్చి హిమ అలా అని ఉండాల్సింది కాదు..కానీ అది హిమ అన్న విషయం గుర్తుపెట్టుకో, సమస్యకు భయపడ్డం కంటే..సమస్య పరష్కారానికి ఆలోచించాలి, నేను ఆలోచించాను కాని తట్టటం లేదు అంటుంది. ఇంతలో దీప, ఆదిత్య వస్తారు. అన్నయ్య పదే పదే ఒక్కటే చెప్తున్నాను అనుకోవద్దు..ఈ సమస్యకు అమెరికా వెళ్లిపోవటం ఒక్కటే మార్గం అంటాడు. ప్రియమణి వెనక నుంచి వింటుంది. అమెరికా వెళ్తే ఈ లొల్లి అంతా ఉండదుగా..అయినా వీళ్లు వెళ్లురు..సీరియల్ సాగదీయాలంటే ఇక్కడే ఉండాలికదా.. ఈ విషయం తెలియక ఆదిత్య వెళ్లమని బలవంతం చేస్తాడు.వీసా ప్రాసెస్ నేను చూసుకుంటాను అంటాడు. దీప, కార్తీక్ ఏం మాట్లడరు. దీప డాక్టర్ బాబు అమెరికా వెళ్లే విషయంలో నేను ఏం మాట్లాడలేను కానీ, మనం ఈ ఇల్లు వదిలిపెట్టేసి మళ్లీ బస్తీకి వెళ్దాం అని పిల్లలు అంటున్నారు డాక్టర్ బాబు అంటుంది. అంతే ఆ మాటకు కార్తీక్ షాక్ నుల్చుంటాడు. హిమను నొప్పించలేకపోతున్నాను, డాడీ బాడ్ బాయ్ అంటుంది అని దీప ఏడుస్తుంది. హిమ సెన్సిటీవ్ అనుకున్నాను కానీ, దానికన్నా ఎక్కువ సెన్సిటీవ్ నేనేమో అంటాడు కార్తీక్. పాపం కార్తీక్ ఏడుస్తూ ఏంటి మమ్మీ ఇది అంటాడు. ఇంతలో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయిభాగంలో పిల్లలు ఇద్దురు లగేజ్ తీసుకుని బయటకు వస్తారు. బయట నుల్చున్న దీప ఈ బ్యాగ్ లేంటి హిమ అంటే..డాడీ మాకు వద్దు అంటుంది. కార్తీక్ వచ్చి హిమ బ్యాగ్ లు సర్దుకుని వెళ్లిపోతున్నారా, డాడీ మీ కొద్దా అంటే..పిల్లలు ఇద్దరు దీప వెనకు కెళ్లి నుల్చుంటారు. ఇక వాళ్లు ఇంట్లోనుంచి వెళ్తారో లేదో రేపు చూద్దాం.

– Triveni Naidu

Read more RELATED
Recommended to you

Exit mobile version