కార్తీకదీపం ( Karthika Deepam ) ఈరోజు ఎపిసోడ్ లో బోనులో ఉన్న సౌందర్య నిర్దోషికి శిక్షపడదిని నా మనసాక్షి చెప్తుంది. తీర్పువెలవడకముందే నా కొడుకు నిర్దోశిషత్వం బయటపడుతుంది. అని చెప్పి కొడుకుని ధైర్యంగా ఉండమని బోనులోంచి వెళ్లిపోతుంది. మోనిత తరుపు లాయర్..సాక్షికన్నా మనసాక్షి ముఖ్యం అని సౌందర్యగారు చెప్పారు. కాని ముద్దాయికి శిక్షపడాలన్నా సాక్ష్యమే ముఖ్యం అని.. కార్తీక్ ను ప్రశ్నించటానికి పర్మిషన్ తీసుకుంటాడు. మోనిత మీకు ఎన్నాళ్లుగా తెలుసు అంటే.. 16ఏళ్లు అని కార్తీక్ అంటాడు. లాయర్..అంటే మీరు 16 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారా అని అడగుతాడు. మేము ప్రేమించుకోలేదు. ఒకవేళ నేను ప్రేమిస్తే.. వేరేఎవరినో పెళ్లిచేసుకోను అని కార్తీక్ అంటాడు. లాయర్..మీరు భార్యపై అనుమానంతో 10ఏళ్లపాటు దూరంగా ఉంచారు అని అంటే.. వెంటనే కార్తీక్ తరుపు లాయర్ కలగచేసుకుంటాడు. మోనిత తరుపు లాయర్ కార్తీక్ వ్యక్తిత్వం మంచిది కాదని.. అనుమానపు భర్త అని అంటాడు. భార్యకు దూరంగా ఉన్న కార్తీక్.. మోనిత దగ్గరకు వెళ్తూ వస్తూ..ఈ క్రమంలోనో మోనితపై మనసుపడి గర్భం చేసి చంపాడు అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ తరుపు లాయర్ ఇదంతా కట్టుకథ అంటాడు. చంపందే శవం ఎక్కడినుంచి వస్తుంది. చంపాడు అనటానికి సాక్ష్యాలు లెవ్వు అంటాడు. మోనిత తరుపు లాయర్ పోలీసులు ప్రేవేశపెట్టిన ప్రాథమిక సాక్ష్యాలు చాలు అంటాడు. అలా ఉండగా..జడ్జ్ లంచ్ బ్రేక్ ఇస్తాడు
ఇంకోవైపు మోనిత దీపను తీసుకుని ఊరిచివరకు వస్తుంది. కారు ఆపగానే వారణాసికి మత్తు ఇచ్చేస్తుంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్ అని దీప అడుగుతుంది. మంచి ప్రశ్న అడిగావ్..స్పాట్ లో లేపేస్తే కిక్కే ముంటుంది దీప ..నీ కళ్లల్లో ప్రాణభయం చూస్తుంటే.. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం సామెత గుర్తొస్తుంది అంటూ దీపను బలవంతంగా ఇంటిలోకి తీసుకెళ్తుంది. గోడపై ఉన్న కార్తీక్ ఫోటోలను చూపిస్తూ తన రాక్షసప్రేమ గురించి దీపకు చెప్తూ ఉంటుంది. నిద్రలేచినప్పటి నుంచి నా కార్తీక్ తో మాట్లాడుతునే ఉంటాను. ఎవరైన చూస్తే పిచ్చిది అనుకుంటారేమే అనుకుంటే నాకేంటి అంటుంది. ఎలా ఉండేదాన్ని ఎలా అయ్యానో చూడు.. ఖరీదైన ఫ్లాట్ లో ఉండేదాన్ని షెడ్ లోకి మారిపోయాను. ఇలా చెప్తూ.. కార్తీక్ వల్ల నాకు దీనస్థితి పట్టింది అంటుంది. నీది దీనస్థితి కాదే..పతనాస్థితి అంటూ..మోనితను బెదిరిస్తుంది దీప. ఇప్పటికైన మించిపోయింది ఏమి లేదు.. బుద్దిగా వచ్చి పోలీసులకు లొంగిపో.ఏ నేరం చేయని నా భర్తను శిక్షనుంచి తప్పించు అంటూ చేయ్ పట్టుకోబోతుంది. మోనిత నేనెక్కడికి రాను..నీ లానే కార్తీక్ కి గేర్ ఎక్కువ..నాకు ఈ స్థితి రావటానికి కారణం నువ్వు. నీ అడ్డు తొలగిస్తా అంటూ దీపకు రివాల్వర్ ఎక్కు పెడుతుంది. ఇక్కడే ఈ క్షణమే చంపేస్తాను. క్షణాలు లెక్కపెట్టుకో అంటుంది. దీప నవ్వుతూ.. అంకెలు లెకపెడుతుంది. మోనిత బిత్తరపోయి చూస్తుంది. 4 వరకు లెక్కపెడుతుంది. తెలివిగా మోనిత చేతిలో ఉన్న రివాల్వర్ తీసుకుంటుంది. ఇప్పుడు అర్థమయిందా..నేను ఏమాత్రం ప్రతిఘటించకుండా నీతో పాటు కూల్ గా ఎందుకు వచ్చానో..నీ అజ్ఞాతస్థావరం తెలుసుకుందాం అని..ఇక్కడే నిన్ను ఆత్మగా మార్చేస్తా..అంటుంది దీప. మోనిత భయంతో ఏ అది రివాల్వార్ పేలుతుంది అంటూ అరుస్తుంది. అవును నీ పుచ్చ పేలుతుంది. నీ పాపం పండిందే.. నీ అఘాయిత్యాలు శృతిమించాయ్..నా భర్తను బెదిరించి జైలుకి కూడా పంపించావ్. మోనిత భయంతో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతుంది. నేను నిన్ను చంపను, నువ్వు నన్ను చంపకు. మనమిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం అంటుంది.
దీప.. నోర్ ముయ్..ఏం మాట్లాడుతున్నావే.. నా భర్తను తగులుకుంటా అని నాతోనే చెప్తున్నావా..ఎంత ధైర్యమే నీకు, ఎన్ని నేరాలు చేశావే. ఎన్ని పాపాలు చేశావే.మగాడివాడిమీద మోజుతో పచ్చని కాపురంలో చిచ్చుపెట్టావ్ అంటూ..మోనిత మారువేషాలను చెప్తూ ఉంటుంది. నీ మాయలకు , నీ కుట్రలు ఈ క్షణమే ముగింపు చెప్పబోతున్నా అంటుంది. మోనిత దీప కాళ్లు పట్టుకుంది. దీప ఏ లేవ్ వే.. నువ్వు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటావ్ అని నాకు తెలుసు అని పైకి లేపుతుంది. మోనిత అప్పుడు కూడా.. ఈ జన్మలో కార్తీక్ ను వదలలేను, కార్తీక్ దూరమైతే నేను తట్టుకోలేను అంటూ భయం భయంగా చెప్తుంది. దీప ఏం మాట్లాడుతున్నావే, నీ లాంటి ఆడదాని కన్ను నా భర్త మీద పడితే నిలువునా చంపి జైలుకైనా వెళ్తా అంటూ దీప భర్తగురించి చెప్తూ..నీ చావు నా చేతుల్లోనే రాసిపెట్టుందే చావు అంటూ మోనితకు పాయింట్ బ్లాక్ లో గన్ గురిపెడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.