కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత చిచ్చుబడ్డులు, మతాబులు, టపాసులు వీటి వెలుగులు నిమిషాలే..ఇప్పుడు మీ ముఖాల్లో కనిపించే ఆనందంకూడా అలాంటిదే.. నేను పెట్టబోయే చిచ్చు ముందు ఈ చిచ్చుబుడ్డులు ఎందుకు పనికిరావు అని చెప్పి వెళ్తుంది. ఇంకోవైపు ఆదిత్య ఫోన్ మాట్లాడుతుంటే శ్రావ్య వస్తుంది. ఆ మోనితకు ఎంత శిక్ష పడుతుందో ఎవర్నైనా లాయర్ని కనుక్కోని చెప్పు అంటుంది శ్రావ్య..దానికి లాయర్ దాక ఎందుకు నేనే చెప్తా అని కనీసం 10ఏళ్లైనా శిక్ష పడుతుంది అంటాడు . శ్రావ్య నూరేళ్లు పడాలి, అసలు ఉరిశిక్ష పడాలి అంటూ బాగా ఫ్రస్టేట్ అవుతుంది. మోనిత చేసిన నేరాలను తలుచుకుంటూ బాగా బాధపడుతుంది. ఇంతలో ఆదిత్య.. వదిన అన్ని కష్టాలకు ఆ మోనితే కారణం.. ఉరిశిక్షే పడాలి అనుకుంటారు ఇద్దరు
జడ్డీ..మీ తరుపున వాదించడానికి ఎవరైనా ఉన్నారా అంటే లేరు నా తరుపున నేనే వాదించుకుంటా అంటూ..సేమ్ రికార్డు ప్లే చేస్తుంది. నేను పెళ్లైన మగాడ్ని ప్రేమించా అంటున్నారు, కానీ నేను ప్రేమించేనాటికి కార్తీక్ కి పెళ్లి కాలేదు అంటుంది. ఇంతలో లాయర్ పైగా ప్రేమించిన అమ్మాయిని కూడా చంపించింది అంటాడు. అది హత్య కాదు యాక్సిడెంట్ అంటుంది మోనిత. రోషిణి హత్యే కార్తీక్ భార్య దగ్గర వీడియో ఉందని తీస్కురమ్మంటుంది. రత్నసీత డిలీట్ చేసిందిగా ముందే.. దీప ఫోనులో ఉండదు. కార్తీక్ ను అడుగుతుంది కార్తీక్ ఫోనులో కూడా ఉండదు. దొరికిందే ఛాన్స్ అని మోనిత కథను తనకు అనుగుణంగా చెప్పుకుంటుంది. లాయర్ వచ్చి..ఏకపక్ష వాగ్మూలం వల్ల మోనిత ఈ కేసును పక్కదోవ పట్టించాలని చూస్తుంది కాబట్టి దీపకార్తీక్ ల వాగ్మూలం కూడా తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అంటాడు.
కార్తీక్, దీప బోనులోకి వస్తారు. వాళ్లని అలా చూసిన మోనిత నన్ను జైలుకి చంపడానికి ఆదర్శ దంపతులుగా వచ్చారు అంటుంది. లాయర్ కార్తీక్ ను మీరు ప్రేమించిన అమ్మాయిది హత్యా, యాక్సిడెంట్ ఆ చెప్పమని అడుగుతాడు. కార్తీక్ హత్యే అని జరిగింది చెప్తాడు. అది తనే ఒప్పుకున్నప్పుడు నేను వీడియో తీశాను. ఆ వీడియో చూసే డాక్టర్ బాబు మోనిత నిజస్వరూపం తెలిసి ఆవేశంతో వెళ్లారు అంటుంది దీప. ఇప్పుడు మా ఇద్దరి సెల్ ఫోన్స్ లో నుంచి ఆ వీడియో ఎలా మాయమైందో అర్థంకావట్లేదు. మోనిత మా దీపక్క చెప్పినట్లు హిమను చంపాలని చూస్తే కార్తీక్ అదే కారులో ఉండగా నేను ఎలా చంపాలని చూస్తా అంటుంది మోనిత. లాయర్ వచ్చి హిమ ఎవరు అంటే కార్తీక్ ప్రేమించిన అమ్మాయి అంటుంది. ఈ పాయింట్ నోట్ చేసుకోండి యువరానర్.. ఈమెకు హిమ ఎవరో తెలుసు, కార్తీక్ ప్రేమించిన అమ్మాయే అని చంపించింది అంటాడు లాయర్. మోనిత నేను చంపించలేదు.. అంజితో యాక్సిడెంట్ చేయించా అంటున్నారు కదా.. అదే నిజమైతే అంజిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించమనండి అంటుంది.
దీప కచ్చితంగా అంజిని తీసుకొస్తాను అంటుంది. మోనిత రత్నసీత వైపు చూస్తుంది. రత్నసీత లేదు అని సైగ చేస్తుంది. సో మ్యాటర్ అర్థమవుతుంది..మోనిత ప్రేట్రేగిపోతుంది ఇగ..అసలు అంజి అనేవాడు కల్పిత పాత్ర తీసుకురాలేరు అంటుంది. జడ్డీ..ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తిచేయండి ఆ తరువాత హిమ ఎవరు, అంజి ఎవరు అనేది దానికి సంబంధించిన అప్పటి రికార్డ్స్ తో పాటు పోలీసుశాఖ వారు నివేదిక తయారుచేయాల్సి ఉంటుంది. లాయర్.. మోనిత మీరు ఇప్పుడు గర్భవతి అని నివేదికలో ఉంది నిజమేనా అంటాడు. మోనిత నిజం అంటుంది. మీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి అని అడిగితే.. కార్తీక్ అంటుంది. కార్తీక్ అబద్ధం..ఆ బిడ్డకు నాకు ఏ సంబంధం లేదు అంటాడు.అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.