కార్తీకదీపం ఎపిసోడ్ 1174: మూడునెలలు ముందుకు వెళ్లిన సీరియల్..తెల్లారితే అమెరికా ప్రయాణం..కార్తీక్ ఇంటికి వచ్చిన విహారి

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో హిమ వద్దంటున్నా అమెరికా వెళ్లాలి అంటున్నారు , నానమ్మా వినదు, ఎవరు వినరు అని ర్యాక్ తీసి బుక్స్, డ్రస్సులు ఎక్కడెక్కడో ఉన్నాయి అని సర్ధటం మొదలుపెడుతుంది. కార్తీక్ డైరీ కిందపడుతుది. హిమ తీసుకుని ఈ డైరీ ఎవరిది ఎప్పుడూ చూడలేదే అనుకుని ఓపెన్ చేసి ఇది డాడీ రైటింగ్ కదా అనుకుని కొట్టేసిన విహారి పేరు చూసి విహారి ఎవరూ అనుకుంటుంది. విహారీ నా జీవితంలోకి ఎందుకు వచ్చాడు అని రాసి ఉంటుంది. హిమకు ఏం అర్థంకాదు. డాడీ జీవితంలోకి రావటంమేంటి, ఈ విహారీ డాడీ ఫ్రెండ్ ఆ, ఎప్పుడూ వినలేదే అనుకుని చూస్తుంది. దీప నువ్వేంటి ఇలా చేశావ్ అని రాసి ఉంది చదివి అమ్మేం చేసింది అనుకుని తెగ కంగారు పడుతుంది.. డైరీ అక్కడే పెట్టేసి వచ్చేస్తుంది.
ఇంకోపక్క సౌందర్య కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. తప్పు చేసింది ఆ మోనిత మనం ఎందుకు పారిపోవాలి అంటాడు కార్తీక్. దానికి పడ్డ శిక్ష కంటే మనకే పెద్దశిక్ష పడింది. అది జైల్లో ఉంది, మనం ఇంట్లో ఉన్నాం అంతే అంటుంది దీప. అయినా ఈ కార్తీక్ యే కదా ఫస్ట్ లో అమెరికా పోదాం అనింది. ఇప్పుడు అంతా ఒప్పుకున్నాక కార్తీక్ ఎందుకు ఒప్పుకోడు. ఎలాగొలా సాగిదీయటం కాకపోతే. దీప అడుగుతుంది..మీరే అన్నారుకదా అమెరికా వెళ్దాం అని అంటుంది. చివరి అవకాశంగా ఏ దిక్కులేకపోతే చూద్దాం అన్నాను అంటాడు కార్తీక్. అన్ని దిక్కులు మూసుకుపోతున్నాయ్. ఇంతకన్నా గొప్ప ఐడియా ఉంటే చెప్పండి అంటుంది దీప. ఇలా దీప, సౌందర్య కార్తీక్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. దీప ఇప్పటికిప్పుడు అంటే ఎలా వెళ్తాం, వీసా ఉంటుంది, స్టాంప్ పడాలి, ఇవన్నీ నీకు తెలియవు అంటాడు కార్తీక్. అవును డాక్టర్ బాబు అవి నాకు తెలియవు, వంటలక్కను కదా దోసెలు వేసుకునే దాన్ని నాకు వీసాలు గురించి నాకు తెలియదు అంటూ ఏదో ఒకటి అంటుంది. మమ్మీ నేను హాస్పటల్ కోసం చాలా కష్టపడ్డాను, ఇప్పుడు దాన్ని వేరే వాళ్లకు ఇవ్వాలి, అమెరికాలో ఇంకోటి చూసుకోవాలి అంటాడు. ఒక్కొక్కటిగా అన్నీ చేద్దాం, రెండుమూడు నెలలు పడుతుందేమో అంతే అసాధ్యం కాదుగా అంటుంది సౌందర్య. సరే కానివ్వండి అని..మీరంతా ఒకే మాటమీద ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను, నా పిల్లలు నాతో బాగుంటారు అనే ఒకే ఒక్కకారణంతో ఒప్పుకుంటాను అని చెప్పి వెళ్తాడు.
కట్ చేస్తే..కొన్నినెలల తర్వాత అని వేస్తారు. కార్తీక్ ఫ్యామిలీ అంతా కలిసి ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు. పిల్లను దీప తీసుకొస్తుందిరా అని కార్తీక్ కు చెప్తుంది సౌందర్య. అందరం కలిసి తిని ఎన్నాళ్లయిందో కదా అనుకుంటారు. ఆనంద్ రావు ఈ మూడు నెలలు అమెరికా గొడవ, హాస్పటల్ కష్టాల్లో ఉన్నాం అంటాడు. మొత్తానికి మొదలుపెట్టిన మూడునెలల్లో అమెరికా వీసా సంపాదించావ్ చిన్నోడా అని సౌందర్య అంటుంది. వీసా రాకూడదు, అన్నయ్యపిల్లలు వెళ్లకూడదని ఒకవైపు..వస్తే అన్ని తలనొప్పులు పోతాయ్ అని మరోవైపు అంటాడు ఆదిత్య. అవును రేపు 10దాటితే అందరూ ఫ్లైట్లో ఉంటారు. మీరు లేని లోటుతో మేము ఇక్కడ అంటుంది సౌందర్య.
ఇంతలో హిమ, శౌర్య వస్తారు. శార్య హిమతో మనం ఎటూ రేపు అమెరికా వెళ్తున్నాం కదా, నాన్నమీద కోపం తగ్గించుకుని అన్ని మర్చిపోయి ఆనందంగా ఉందాం అంటుంది. కావలంటే నువ్వు మర్చిపో అంటుంది హిమ. దీప ఏంటే నువ్వు నీ సొమ్మేదో పోయినట్లు మొఖం మాడ్చుకుని ఉంటావ్, మనం రేపువెళ్లిపోతున్నాము కదా..అందరితో సంతోషంగా ఉంటే ఏమైతనది అని, అందరితో కలిసి భోజనం చేయాలి, సంతోషంగా ఉండాలి అంటుంది. హిమ సీరియస్ గా ఇప్పుడేంటి అందరితో కలిసి భోజనం చేయాలి అంతేకదా అని వెళ్లి కుర్చుంటుంది. అందరూ తలా ఓ మాట అంటారు. తప్పుచేసింది డాడీ, నన్నంటారేంటి అంటుంది హిమ. నోర్ మూయ్ వే మీ డాడీ చాలా మంచోడు, మీ డాడ్ ఏ తప్పు చేయలేదు, తప్పు చేసింది ఆ మోనిత ఆన్టీ జైల్లో ఉంది, నీ మైండ్ లోంచి ఆ చెత్తనంతా తీసేయ్ అంటాడు. ఈ పిల్లలు ఓవర్ యాక్షన్ చూస్తే ఇరిటేషన్ వస్తుంది అసలు. సౌందర్య అలిగినా అరిచినా ఇక అన్నీ మీ అమ్మానానమ్మలమీదే కదా..మేమంతా ఇక వీడియోకాల్స్ లోనే కనిపిస్తాం కదా అని..మమ్మల్ని మర్చిపోతారా, మమల్ని మర్చిపోయినా పర్వాలేదులే..మీ అమ్మానాన్నలతో హ్యాపీగా ఉండండే అంటుంది. ఇళా వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా విహారి, వాళ్ల వైఫ్ వస్తారు.
అందరూ షాక్ అవుతారు. మీరు అమెరికా వచ్చారని ఒకసారి కలిసివెళ్దాం అని వచ్చాం అంటాడు. దీప భోజనం చేద్దురు మీరు రండి అంటుంది. మోమ్ బయటవేయిట్ చేస్తాం అని వెళ్లబోతాడు. ఆనంద్ రావు ఏమయ్యా విహారి మరి అంత మొహమాటం ఏంటయ్యా అంటాడు. విహారి పేరు వినగానే..హిమ అంకుల్ ఆగండి అని వెళ్లి..దీపరాధల పుస్తకం రాసింది మీరేనా అంకుల్ అంటుంది. అందరూ షాకై చూస్తారు. కార్తీక్ కి ఫీజులు ఎగిరిపోతాయ్. చెప్పండి అంకుల్, మీరు ఆ విహారేనా అంటుంది హిమ. విహారి అవునమ్మా అంటాడు. మా అమ్మ మీకు ఎలా తెలుసు అంకుల్ అంటుంది హిమ. మా డాడీకి మీరంటే ఎందుకు కోపం అంకుల్ అని అడుగుతంది. అందరూ దిమ్మతిరిగిపోతారు. ఏంటి అంకుల్ మాట్లాడరేంటి. మా డాడీకి మీరంటే ఎందుకు కోపం అని మళ్లీ అడుగుతంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ ప్రశ్నకు మళ్లీ ఎంత రచ్చ అవుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version