పాస్టర్ ప్రవీణ్ మృతిపై హోం మంత్రి అనిత కీలక ప్రకటన చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్నారు మంత్రి అనిత . డీజీపీతో కూడా మాట్లాడి దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆదేశించానని ప్రకటించారు హోం మంత్రి అనిత. ఇది యాక్సిడెంట్ గా పరిగణించకుండా అనుమానాస్పద మృతిగానే దర్యాప్తు చేస్తున్నామన్నారు హోం మంత్రి అనిత.
ఇక అటు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం పూర్తి అయింది. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన పోస్టుమార్టం. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డు చేశారు పోలీసులు. ప్రవీణ్ మృతదేహం హైదరాబాద్ కు తరలించారు. ఆసుపత్రికి కేఏ పాల్, హర్షకుమార్, మార్గాని భరత్ రావడంతో…. ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.