కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. దీప మోనిత పేరు ఎత్తగానే మనోడికి చిర్రెత్తిపోతుంది. ఆ టాపిక్ తప్ప ఇంకేం లేవా అంటూ..వెళ్లిపోతాడు. ఇన్ని చెప్పాడుకానీ..అడిగిన దానికి సమాధానం చెప్పకుండానే వెళ్లిపోతాడు. దీప ఎన్నోప్రశ్నలు ఉన్నాయ్, ఎన్నో అడగాలనుకున్నాను, కొత్త ప్రశ్నలిచ్చి వెళ్లిపోతున్నారు డాక్టర్ బాబు అనుకుంటుంది. తెల్లారుతుంది. సౌందర్య, ఆనంద్ రావులు బయటకు నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడే కార్తీక్ ఎదురొస్తాడు. ఆనంద్ రావు కార్తీక్ ని పిలిచి చెంప పగలకొడతాడు. ఎంతపనిచేశావ్ రా, దౌర్భాగ్యుడా, నిన్ను ఈరోజు చంపేస్తా అంటూ కాలర్ పట్టుకునే ఉంటాడు. ఇంతలో దీపరావటం చూసి కామ్ అయిపోతాడు. మావయ్యగారు కాఫీ తెమ్మంటారా అంటే సౌందర్య వాకింగ్ కి వెళ్తున్నాం వద్దూ అంటుంది. కానీ ఆనంద్ రావు తీసుకురామ్మా అంటాడు. దీప ఏంటి మావయ్యాగారు డాక్టర్ బాబు చెంపనిమురుతున్నారు అంటే..మచ్చపడిందిలేమ్మా అంటాడు. దీప ఏం కనిపించటం లేదుగా అంటే..కొన్ని మచ్చలు పైకి కనిపించవు లేమ్మా అంటాడు. దీప లోపలికి వెళ్తుంది. ఆనంద్ రావు కార్తీక్ ని చెడమడా తిడతాడు. దీపను మోసం చేశావ్, దీప కళ్లల్లోకి కళ్లుపెట్టి చూసేధైర్యం లేదురా నాకు, నా మనసు చచ్చిపోయిందిరా, ఇవన్నీ చూడటానికా నేను బతికున్నది అని వాకింక్ కి వెళ్లిపోతారు. దీప కాఫీ తీసుకుని వచ్చి కార్తీక్ ని అడుగుతుంది. వెళ్లిపోయారు అంటుంది. ఏమైనా చెప్పారా అంటే..చెప్పాల్సిందేదో చెప్పారు అని వెళ్లిపోతాడు. అందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు, ఈరోజు ల్యాబ్ కి వెళ్లొచ్చాక చెప్తా అనుకుంటుంది.
ఇక్కడ కార్తీక్ వాళ్ల నాన్న చెంపపగలుకొట్టింది గుర్తుచేసుకుని బాధపడతూ ఉంటాడు. సౌందర్య మాత్రం నీట్ గా రెడీ అయ్ వచ్చి..పెద్దోడా నాకేం తోచటం లేదురా, ఏం చేద్దాం రా అంటాడు. ఇప్పుటివరకూ చేసిన నిర్వాకం చాల్లేదేమో సౌందర్యకు. నిజం దీపకు తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించటానికే నాకు భయంగా ఉందిరా అంటూ ఏడుస్తుంది. ఇంట్లో పిల్లలు దీప కోసం వెతుకుతారు. బయట సౌందర్య ఏడ్చుకుంటూ గతంలో జరిగింది కార్తీక్ కు చెబుతూ ఉంటుంది. మొత్తానికి నేను ఏం చేయలేను అంటుంది సౌందర్య. ఇంతలో పిల్లలు వచ్చి నానమ్మా అమ్మ కనిపించటంలేదు అంటారు. సౌందర్య ఏమంటున్నావే నువ్వు అంటుంది. ఇళ్లంతా వెతికాం ఎక్కడాలేదు అంటారు. కార్తీక్ ఫోన్ చేద్దాం అంటే..ఫోను కూడా ఇంట్లోనే పెట్టివెళ్లింది అంటారు. సౌందర్య బాగా ఆలోచించండి, మీకేమైనా చెప్పి వెళ్లిందేమో గుర్తుచేసుకోండి అంటుంది. మాకేం చెప్పలేదు అంటారు. అమ్మరాత్రంతా నిద్రపోలేదు అంటుంది హిమ. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.
దీప మాతృ స్త్రీ సంతానసాఫల్యం ల్యాబ్ కి వస్తుంది. ఆరోజు పల్లవి కార్తీక్ రికార్డ్స్ చూసిన ఆమె లీవ్ లో ఉందని చెబుతుందిగా..దీప వచ్చి ఎవరో రావాలని అన్నారు వచ్చారా అని అడుగుతుంది. వచ్చారు మీరు కూర్చోండి అని పల్లవి వెళ్తుంది. దీప ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆ శాంపిల్ ఇక్కడుందో లేదో తెలిస్తే కానీ నేను ఒక అంచనాకి రాగాలను అనుకుంటూ తీక్షణంగా ఆలోచిస్తుంది. ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో ప్రియమణి పుట్టిన బాబు పేగు మెడకేసుకుని పుట్టాడు కదమ్మా అని సౌందర్యకు చెబుతుంది. ఆ పుడితే అని సౌందర్య అంటే..అలా పుడితే తండ్రికే ప్రమాదం..తండ్రి అంటే మన కార్తికయ్యే కదమ్మా అంటుంది. ఇది కూడా మోనితప్లాన్ లో భాగమే అయిఉంటుంది. ల్యాబ్ లో దీప డాక్టర్ తో మాట్లాడుతుంది. శాంపిల్ బయటకు వెళ్లలేదు, ఈ విషయం ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెబుతునా అంటాడు. దీపకు మ్యాటర్ అర్థమవుతుంది. దీనంగా నడుచుకుంటూ బయటకు వస్తుంది.