కార్తీకదీపం 1200: వీధి చివర మోనితను కలిసిన కార్తీక్..ఫోన్ కాల్ తో కార్తీక్ కు షాక్ ఇచ్చిన మోనిత  

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత ఇంట్లో దీపాలు వెలిగించి..నా కార్తీక్ తో కలిసి దీపావళి ఎప్పుడు జరుపుకుంటానో అనుకుని..ప్రియమణితో ఆనంద్ రావుగారిని జాగ్రత్తగా చూసుకో..ఈ దీపావళికి నేనో ఆ దీపో కార్తీక్ తో తేల్చుకుంటాను అని ప్రియమణితో ఏదో షిట్ అంతా మాట్లాడుతుంది. గతంలో కార్తీక్ నాతో ఎంతోబాగుండేవాడు…మరి ఇప్పుడు అన్నీ మర్చిపోయి ఆ దీప నామస్మరణ చేస్తున్నాడు. తప్పాకాదా చెప్పు ప్రియమణి అంటే..అది తప్పే అంటుంది. తప్పేంటి తప్పున్నర తప్పు అని సీన్ బాగా ల్యాగ్ చేస్తుంది. ఫైనల్ గా ఈ మోనిత చెప్పేది ఏంటంటే..దీప మాయలోంచి కార్తీక్ ను బయటకు తీసుకొస్తాను, ఎటూ ఆదిత్యద్వారా అగ్గిరాజేశాను కదా ఇంటికివెళ్లి తేల్చుకుంటాను, అందరూ దీపావళికి దీపం వెలిగిస్తే నేను వెళ్లి ఆ దీపం ఆర్పేస్తాను అని ప్రియమణికి చెప్పి కార్తీక్ ఇంటికి బయలుదేరుతుంది.
ఇక్కడ కార్తీక్ ఇంటి బయట నిలబడి దీప గురించి ఆలోచిస్తాడు. దీప మనసులో ఏముంది. ఎమన్నా తీసుకోకూడని నిర్ణయం తీసుకుందా అని తెగ ఆలోచిస్తాడు..ఇంతలో మోనిత పోన్ చేస్తుంది. కొత్తనంబర్ నుంచి ఫోన్ చేస్తుంది. ఈ కాల్ కట్ చేస్తే ఇంకో పదినెంబర్ నుంచి కాల్ చేస్తాను అంటుంది. ఎందుకు ఫోన్ చేశావ్ అని కార్తీక్ అంటే..భార్య భర్తకు ఎందుకు ఫోన్ చేస్తుంది. అని సోదంతా చెప్తుంది. కార్తీక్ కు కాల్తుంది. మీ వీధి చివర కారులో ఉన్నాను వచ్చి దర్శనమివ్వండి అంటుంది. నేను రానంటే అని కార్తీక్ అంటే..నేనే వస్తాను అని మోనిత అంటుంది. కార్తీక్ కాల్ కట్ చేస్తాడు. కార్తీక్ వెళ్లి నాలుగు దులిపి వస్తాను అనుకుని కారు తీయబోతాడు..ఇంతలో దీప పిలిచి..ఎక్కడికో వెళ్తున్నట్లు ఉన్నారు అంటే..ఎక్కడికిలేదు దీప అంటాడు. దీప ఏదో ఆలోచిస్తున్నారు, ఏమైంది డాక్టర్ బాబు, ఎందుకు అంత కంగారుగా ఉన్నారు అని అడుగుతుంది. ఇంతలో మోనిత కాల్ చేస్తుంది. కార్తీక్ లిఫ్ట్ చేయడు. ఫోన్ మాట్లాడలేకపోయారా అని దీప అంటే..పెద్ద ఇంపార్టెంట్ కాల్ ఏం కాదు దీప అని కార్తీక్ అంటాడు. పండగకదా..విషెస్ చెప్పడానికి ఫోన్ చేసి ఉంటారు, మీకు అసలే అభిమానులు ఎక్కువకదా అంటుంది. కార్తీక్ కి ఏం అర్థంకాదు. ఏమైంది డాక్టర్ బాబు అలా ఉన్నారు అని దీప అంటే..నేను బానే ఉన్నాను, నువ్వే ఏదోలా ఉంటున్నావ్ ఈ మధ్య అంటాడు కార్తీక్. నాకేమైంది, నేను బానే ఉన్నాను స్వామి, మనం రేపు గుడికి వెళ్దామా అని అడుగుతుంది. వెళ్దాం ఎందుకు స్పెషల్ ఏంటి అని కార్తీక్ అడిగితే..స్పెషల్ ఏం లేదు, మీరు బాగుండాలని అంతే అంటుంది కార్తీక్.
దీప నేను నీతో మాట్లాడాలని వచ్చాను, మనం మాట్లాడుకోని చాలారోజులు అయిందికదా అంటుంది. కార్తీక్ అవును, మనం మనకోసం మనం మాట్లాడుకోని చాలా రోజలైంది దీప అంటాడు. దీప మాట్లాడుతుంది..ఇంతలో మోనిత ఫోన్ చేస్తుంది. ఇప్పుడే దీప మాట్లాడుతుంది..మళ్లీ ఈ మోనిత ఒకటి ప్రాణం తీస్తుంది అనుకుని ఇప్పుడే వస్తాను దీప, పిల్లలను రెడీ చేయ్ అని వెళ్లిపోతాడు. మోనిత కూడా కాల్ కట్ చేస్తే వెనక్కు వెళ్లిపోతా అనుకుంటున్నావా మీ ఇంటికే వస్తాను కారు తీస్తుంది. ఇద్దరూ ఎదురవుతారు. మోనిత మంగళసూత్రం సైడ్ చేసి దాచిపెడుతుంది. కారు దిగుతారు. కార్తీక్ భయపడే వచ్చి..మళ్లీ నువ్వురాకపోతే నేను భయపడతా అనుకున్నావా అంటాడు. మోనిత హ్యాపీ దీపావళి కార్తీక్, నాకు స్వీట్స్ తెచ్చావా అంటుంది. అసలు సంతంకం పెట్టకుంటే బాగుండేది మమ్మీ పెట్టమంది కాబట్టి పెట్టాను అంటాడు. మరి పిల్లను కూడా మమ్మీ అనిబోతుంది. కార్తీక్ కొట్టబోతాడు..ఇది మీ ఏరియా నువ్వు ఏం చేసినా నీ పరువే హుష్ కాకీ అంటుంది మోనిత. నీ బెదిరింపులకు భయపడేరోజులు పోయాయ్ అని కార్తీక్ అంటే..అవునా..చూద్దాం అని ఎవరికో కాల్ చేసి మై డియర్ టీం వెల్కమ్ అంటుంది.
కార్తీక్ మోనితతో కాసేపు వాదించి కారు తీయబోతాడు. ఇంతలో పదిమంది వచ్చి కార్తీక్ తో సెల్ఫీ తీసుకోడానికి ఎగబడతారు. ఏ మోనిత ఏంటిది అంటే.. నీ ఫ్యాన్స్ కార్తీక్ ,నీకు సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు..ఇది కొసరు మాత్రమే..అసలు సినిమా మామూలుగా ఉండదు. చెప్పినమాట వినకపోతే..ఇద్దర్ని కలిపి ఫొటోతీసుకుని పెడతారు అంటుంది మోనిత. కార్తీక్ కారుతీసి వెళ్లిపోతాడు. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version