ప్రమోట్‌ చేయలేదు..బాక్సాఫీసును షేక్‌ చేస్తున్న కార్తికేయ 2

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ” కార్తికేయ 2″. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ మైథాలజికల్ ఫిల్మ్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంది.సినిమా రిలీజ్ అయి రెండు వారాలైనా బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. ఇక వంద కోట్ల క్లబ్‌లో చేరడంతో చిత్రబృందం కర్నూలులో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ వేడుకలో నిఖిల్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. నిఖిల్ ఏంటి బాలీవుడ్‌కు వెళ్లడమేంటని.. నాలాగే అందరూ అనుకున్నారు.. కానీ విడుదలయ్యాక పరిస్థితి మారింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా 1200 స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. ఇది కార్తికేయ 2 విజయం కాదు.. తెలుగు సినిమా విజయం. సినిమా అంటే బాక్సాఫీస్ నెంబర్లు కాదని, ఓ ఎమోషన్.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమే 100 కోట్లతో సమానం.. అని అన్నాడు.

అయితే కార్తికేయ2 ప్రభంజనం 100 కోట్లతో ఆగేలా లేదు. అందుకు కారణం.. ఈ వారం రిలీజ్ అయిన లైగర్ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడమే అని చెప్పొచ్చు. పూరి నుంచి భారీ అంచనాల మధ్య లైగర్ రిలీజ్ అవడంతో.. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా కార్తికేయ 2 పై ఉంటుందనుకున్నారు. కానీ ఇప్పుడు లైగర్ పరిస్థితులు తారుమారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ వీకెండ్ ఇక్కడ, అక్కడా కలిపి కార్తికేయ2కి మరో పది కోట్లు రాబట్టడం ఖాయమనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version